రిజర్వేషన్ వివాదం, చిక్కుల్లో ఏపీ సీఐడీ డీజీ సునీల్ కుమార్, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు

By Siva Kodati  |  First Published Jun 9, 2021, 5:41 PM IST

ఏపీ సీఐడీ ఏజీడీ సునీల్ కుమార్‌పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు లీగల్ రైట్స్ అడ్వైజర్ కన్వీనర్ జోషి. సునీల్ కుమార్ సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారు అంటూ సదరు ఫిర్యాదులో పేర్కొన్నారు. 


ఏపీ సీఐడీ ఏజీడీ సునీల్ కుమార్‌పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు లీగల్ రైట్స్ అడ్వైజర్ కన్వీనర్ జోషి. సునీల్ కుమార్ సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారు అంటూ సదరు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్సీ మాల పేరుతో రిజర్వేషన్ పొంది క్రిస్టియన్‌గా మతం మార్చుకున్న సునీల్ కుమార్ సర్వీసు నుంచి తప్పించాలని జోషీ కోరారు. మతం మార్చుకున్నవారు రిజర్వేషన్లు వదులుకోవాలి అన్న మద్రాస్ హైకోర్టు తీర్పు మేరకు సునీల్ కుమార్‌ను సర్వీసు నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు.

Also Read:నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసు: ఏపీ సీఐడీ అసంతృప్తి

Latest Videos

సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతో సునీల్ కుమార్ ప్రారంభించిన సంస్థపైనా పూర్తి స్థాయిలో విచారణ జరపాలని జోషీ కోరారు. అంబేద్కర్ మిషిన్ పేరుతో హిందూ వ్యతిరేక భావాలను ప్రోత్సహించే సునీల్ కుమార్ పై సెక్షన్ 153a, సెక్షన్ 295a కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి హోం శాఖ పూర్తి స్థాయిలో విచారణ జరపాలని జోషి డిమాండ్ చేశారు. 

click me!