ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతోంది. నైరుతి రుతుపవనాల కారణంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో వరద ప్రవాహం ప్రారంభమైంది. కర్ణాటక రాష్ట్రం నుండి తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది.
కర్నూల్: ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతోంది. నైరుతి రుతుపవనాల కారణంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో వరద ప్రవాహం ప్రారంభమైంది. కర్ణాటక రాష్ట్రం నుండి తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది.
జూరాల దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు కూడ వరద నీరు వస్తోంది. సుంకేసుల నుండి 3284 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం 809.10 అడుగుల మేర ప్రాజెక్టులో నీరుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 215 టీఎంసీలు. ప్రస్తుతం 33.7658 టీఎంసీల నీరు మాత్రమే ప్రాజెక్టులో ఉంది. నైరుతి పవనాలతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా నదులపై నిర్మించిన ప్రాజెక్టులకు త్వరలోనే వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.