సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రవీణ్ ప్రకాష్ ను బదిలీ ఏపీ ప్రభుత్వం సోమవారం నాడు బదిలీ చేసింది.
అమరావతి: ఏపీ సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న Praveen Prakash బదిలీ అయ్యారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. CMO పేషీలో ప్రవీణ్ ప్రకాష్ New Delhi కి బదిలీ చేయడం ప్రాధాన్యత సంతరించుకొంది.
ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి Bhavana Saxena న్యూఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా ఇప్పటివరకు కొనసాగారు. అయితే ఆమెను విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీగా బదిలీ చేశారు. దీంతో ప్రవీణ్ ప్రకాష్ ను న్యూఢిల్లీలోని ఏపీ భవన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. ప్రవీణ్ ప్రకాష్ ఆకస్మాత్తుగా బదిలీ కావడం చర్చకు దారి తీస్తోంది. అయితే గతంలో కంటే ప్రవీణ్ ప్రకాష్ ప్రాధాన్యత కొంత తగ్గిందనే ప్రచారం కూడా లేకపోలేదు. అయినా కూడా ప్రవీణ్ ప్రకాష్ ను సీఎంఓ నుండి తొలగించి న్యూఢిల్లీకి బదిలీ చేయడం సాధారణంగానే జరిగిందా ఇంకా ఏమైనా కారణాలున్నాయా అనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతుంది.
undefined
2021 జూలై 14న ప్రవీణ్ ప్రకాష్ కు జీఏడీ పొలిటికల్ బాధ్యతల నుండి తప్పించింది YS Jagan సర్కార్. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ ఉన్న సమయంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. ప్రవీణ్ ప్రకాష్ స్థానంలో సీఎం అదనపు కార్యదర్శిని GAD పొలిటికల్ సెక్రటరీగా నియమించారు. జీఏడీ సెక్రటరీ పదవి నుండి తప్పించినా కూడా ప్రవీణ్ ప్రకాష్ ను సీఎంఓ సెక్రటరీగా కొనసాగించారు.
గతంలో LV Subramanyam రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో సీఎంఓ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ షోకాజ్ నోటీసులు జారీ అయిన తర్వాత ఎల్వీ సుబ్రమణ్యం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుండి రాష్ట్ర ప్రభుత్వం తప్పించింది. ఈ మేరకు 2019 నవంబర్ 4వ తేదీన ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంతేకాదు గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ది కేంద్రం డీజీగా నియమించారు.
బిజినెస్ రూల్స్ సవరిస్తూ ప్రవీణ్ ప్రకాష్ జారీ చేసిన జీవోపై ఎల్వీ సుబ్రమణ్య షోకాజ్ నోటీసు జారీ చేశారు. అయితే ఎల్వీ సుబ్రమణ్యం ద్వారా షోకాజ్ అందుకొన్న ప్రవీణ్ ప్రకాష్ పేరుతోనే ఎల్వీ సుబ్రమణ్యం సీఎస్ పదవి నుండి తప్పిస్తూ బదిలీ ఉత్తర్వులు రావడం గమనార్హం. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో పోలింగ్ జరిగే సమయంలో ఈసీ ఆదేశాలతో ఎల్వీ సుబ్రమణ్యం ఏపీ రాష్ట్ర సీఎస్ గా బాధ్యతలు చేపట్టారు. జగన్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కొంత కాలం ఆయన సీఎస్ గా కొనసాగారు. ప్రవీణ్ ప్రకాష్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చిన తర్వాత ఎల్వీ సుబ్రమణ్యం Chief Secretary పదవి నుండి తప్పించారు.
ఎల్వీ సుబ్రమణ్యాన్ని బాపట్లకు బదిలీ చేసిన వారం రోజుల తర్వాత అడిషనల్ సెక్రటరీ గురుమూర్తిపై బదిలీ వేటు వేసింది. గురుమూర్తిని బీసీ సంక్షేమ శాఖకు బదిలీ చేశారు. ఈ బదిలీ ఉత్తర్వులను కూడా ప్రవీణ్ ప్రకాష్ జారీ చేశారు. గురుమూర్తి సాధారణ పరిపాలన శాఖలో అదనపు సెక్రటరీగా ఉన్నారు. ప్రవీణ్ ప్రకాష్‌కు అప్పటి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం షోకాజ్ నోటీస్ పంపడం వెనుక గురుమూర్తి ప్రమేయం ఉన్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది.
జీఏడీ అదనపు సెక్రటరీగా ఉన్న గురుమూర్తిని బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో మరో సీనియర్ ఐఏఎస్ అధికారి కిశోర్ కుమార్‌కు పోస్టింగ్ ఇచ్చింది. దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం విభాగం డైరెక్టర్‌గా ఉన్న కిశోర్ కుమార్‌కు జీఏడీ అదనపు ప్రిన్సిపల్ సెక్రటరీగా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది.