ఆ ఎంపీలతోనే ప్రత్యేక హోదా ఎజెండా తొలగింపు: చంద్రబాబుపై ఏపీ మంత్రి పెద్ది రెడ్డి

Published : Feb 14, 2022, 05:40 PM IST
ఆ ఎంపీలతోనే ప్రత్యేక హోదా ఎజెండా తొలగింపు: చంద్రబాబుపై ఏపీ మంత్రి పెద్ది రెడ్డి

సారాంశం

టీడీపీకి చెందిన మాజీ ఎంపీలతో హోం శాఖ నియమించిన త్రీమెన్ కమిటీ ఎజెండానుండి ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టించారని ఏపీ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు.

విజయవాడ: కేంద్ర హోంశాఖ నియమించిన త్రీమెన్ కమిటీలో సమావేశం ఎజెండా నుండి  Special Status అంశం తొలగించడం వెనుక  TDP చీఫ్ Chandrababu కుట్ర ఉందని ఏపీ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి Peddi Reddy Rama Chandra Reddy రామచంద్రారెడ్డి విమర్శించారు.

సోమవారం నాడు ఏపీ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కృష్ణా జిల్లా Jaggayyapetలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నిర్వహించిన సభలో మాట్లాడారు.కేంద్ర హోంశాఖ నేతృత్వంలో జరిగే సమావేశం అజెండా నుంచి ప్రత్యేక హోదా తొలగింపు చంద్రబాబు కుట్రే అన్నారు.

 BJPలోని  మాజీ టీడీపీ నేతల ద్వారా ఈ పని చేయించారని విమర్శించారు. ముఖ్యమంత్రి YS Jagan ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. ప్రత్యేక హోదా కోసం మా పోరాటం కొనసాగుతుందని మంత్రి చెప్పారు.చంద్రబాబుకు ప్రత్యేక హోదా పై మాట్లాడే అర్హతే లేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కోసం టీడీపీ అమ్ముడుపోయిందని  అంటూ  మంత్రి మండిపడ్డారు 

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలకు సంబంధించి ఓ పరిష్కారం చూపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల సీఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులతో విభజన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నెల 17న ఈ కమిటీ సమావేశం కానుంది. అయితే ఈ భేటీకి సంబంధించిన ఎజెండా విషయంలో కేంద్రం ఏపీకి షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఎజెండా నుంచి తొలగించింది కేంద్రం. త్రిసభ్య కమిటీ ఎజెండాలో ఏపీ ప్రత్యేకహోదా, రెవెన్యూ లోటు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, పన్నురాయితీలు అనే అంశాలు లేవు. 9 అంశాల నుంచి 5 అంశాలకే ఎజెండాను పరిమితం చేసింది. 

ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీల పెండింగ్ అంశాల పరిష్కారానికి శనివారం కేంద్ర హోంమంత్రిత్వశాఖ  త్రీ మెన్ కమిటీని నియమించింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిష్కారం కాని విభజన సమస్యల మీద కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఫిబ్రవరి 17న ఉదయం 11 గంటలకు కమిటీ తొలి భేటీ  నిర్వహించనున్నారు. హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్‌కుమార్‌, తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌ లతో కమిటి ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలోనే ఈనెల 17న తొలి భేటీ కావాలని నిర్ణయించినట్లు రెండు రాష్ట్రాల అధికారులకు కేంద్ర హోం శాఖ సమాచారం పంపింది. ఈనెల 8న పంపిన సమాచారంలో మధ్యాహ్నం 3.30గం.లకు భేటీ కావాలని నిర్ణయించినా... తరువాత భేటీ సమయాన్ని హోం శాఖ అధికారులు 11గం.లకు మార్చారు. ఈ త్రిసభ్య కమిటి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భేటీ కానుంది. షెడ్యూల్‌ 9, 10లలో ఉన్న సంస్థల విభజన, ఆస్తుల పంపకాలు, ఇటీవల రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాస్పద అంశాలపై కూడా చర్చించనుంది.

PREV
click me!

Recommended Stories

Eid-ul-Fitr 2026 Celebrations in Vijayawada: ఘనంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు | Asianet News Telugu
Chandrababu TTD Visit:దేవాన్ష్ జన్మదినం..తిరుమలశ్రీవారి సేవలోChandrababu Family| Asianet News Telugu