ఏపీవాసులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్: నైట్ కర్ఫ్యూ ఎత్తివేత

By narsimha lode  |  First Published Feb 14, 2022, 6:08 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్టుగా సీఎం జగన్ ప్రకటించారు. అయితే మాస్కులు కచ్చితంగా పెట్టుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో Night Curfew  ఎత్తివేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే మాస్కులు కచ్చితంగా ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. Corona జాగ్రత్తలు పాటించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఫీవర్ సర్వేను కొనసాగించాలని కూడా సీఎం YS Jagan అధికారులను ఆదేశించారు. ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎం కోరారు.

కరోనా కేసులు వ్యాప్తిని నిరోధించేందుకు ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 18వ  తేదీ నుండి ఏపీలో నైట్ కర్ఫ్యూను అమల్లోకి తీసుకొచ్చింది. రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూను అమలు చేశారు.  నైట్ కర్ఫ్యూను పొడిగిస్తూ వచ్చింది ప్రభుత్వం. కరోనా కేసుల్లో తగ్గుదల కన్పిస్తున్న నేపథ్యంలో  రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను ఎత్తివేసింది.

Latest Videos

తొలుత జనవరి 18 నుండి జనవరి 31వరకు నైట్ కర్ఫ్యూను కొనసాగించారు. ఆ తర్వాత ఈ నెల 1వ తేదీ నుండి 14వ తేదీ వరకు  నైట్ కర్ఫ్యూను కొనసాగించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఇవాళ్టితో నైట్ కర్ఫ్యూ గడువు ముగిసింది. దీంతో ఈ నెల 15వ తేదీ నుండి ఏపీలో నైట్ కర్ఫ్యూను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకొన్నారు.2021 లో కూడా కరోనా కేసుల వ్యాప్తిని  నిరోధించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూు చాలా కాలం పాటు కొనసాగించింది. 

 అయితే అత్యవసర సేవలు, ఆస్పత్రులు, వైద్య పరీక్షా కేంద్రాలు, మందుల షాపులు, మీడియా ప్రతినిధులకు.. నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆస్పత్రులు, మెడికల్ ల్యాబ్స్, ఫార్మసీ రంగాలు, మీడియా, పెట్రోల్‌ బంకులు, విద్యుత్ సిబ్బంది, నీటి సరఫరా, పారిశుద్ద్య సిబ్బంది, ఐటీ, ఐటీ సంబంధిత సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. అత్యవసర విధుల్లో ఉండే న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది, స్థానిక సంస్థలకు చెందిన సిబ్బందికి కూడా మినహాయింపు కల్పించారు. అయితే విధి నిర్వహణలో ఉన్నవారు ఐడీ కార్డును చూపాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. గర్భిణులు, చికిత్స పొందుతున్న పేషెంట్లు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల నుంచి రాకపోకలు కొనసాగించేవారు తగిన ఆధారాలు చూపడం ద్వారా వారు గమ్యస్థానాలు చేరుకునే వీలు కల్పించారు. 

దేశంలో క‌రోనా కొత్త కేసులు భారీగా త‌గ్గుముఖం ప‌ట్టాయి..కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త న‌మోదైన క‌రోనా వైర‌స్ కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గాయి.  కొత్తగా 34,113  కోవిడ్‌-19 కేసులు వెలుగుచూశాయి. అంత‌కు ముందు రోజుతో పోలిస్తే  24 శాతం కొత్త కేసులు త‌గ్గిపోయాయి. దీంతో   దేశంలో క‌రోనా బారిన‌ప‌డ్డ వారి సంఖ్య మొత్తం 4,26,65,534కు పెరిగింది. ఇదే స‌మ‌యంలో91,930 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కోవిడ్-19 రిక‌వ‌రీల సంఖ్య 4,16,77,641 కి పెరిగింది. ప్ర‌స్తుతం 4,78,882 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

గ‌త 24 గంటల్లో క‌రోనా మ‌హ‌మ్మారితో పోరాడుతూ 346 మంది ప్రాణాలు కోల్పోయారు. అంత‌కు ముందు రోజుతో పోలిస్తే మ‌ర‌ణాలు స‌గానికి త‌గ్గాయి. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో మొత్తం 5,09,011 మంది కరోనా వైర‌స్ కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం క‌రోనా రిక‌వ‌రీ రేటు 97.5 శాతంగా ఉండ‌గా మ‌ర‌ణాల రేటు 1.19 శాతంగా ఉంది. 

click me!