వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మూడు కంటే తక్కువ సీట్లొస్తాయి: జగన్

By narsimha lodeFirst Published Dec 1, 2020, 10:43 AM IST
Highlights

వచ్చే ఎన్నికల్లో  టీడీపీకి రెండు లేదా మూడు సీట్ల కంటే  ఎక్కువ రావని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. 


అమరావతి: వచ్చే ఎన్నికల్లో  టీడీపీకి రెండు లేదా మూడు సీట్ల కంటే  ఎక్కువ రావని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. 

ఏపీ అసెంబ్లీలో రెండో రోజూ  మంగళవారం నాడు టీడీపీపై  జగన్ విరుచుకుపడ్డారు.

టిడ్కో ఇళ్ల పంపిణీపై చర్చకు టీడీపీ పట్టుబట్టింది. ఈ సమయంలో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసనకు దిగింది.

ఈ విషయమై సీఎం జగన్ స్పందించారు. అసెంబ్లీ టీడీపీ అనవసర రాద్దాంతం చేస్తోందన్నారు. చర్చ జరగకుండా పోడియం వద్దకు వచ్చి నిరసనకు దిగడం సరైందా అని ఆయన ప్రశ్నించారు. 

చంద్రబాబు పథకం కావాలా... తమ ప్రభుత్వ పథకం కావాలా అని ప్రజలను అడిగితే చంద్రబాబు పథకం గురించి కనీసం 10 మంది కూడా కోరుకోలేదన్నారు. రైతులకు భీమా సొమ్ము డిసెంబర్ 15న రైతుల ఖాతాల్లో జమ అవుతోందని ఆయన చెప్పారు.

ఒక్క బటన్ నొక్కితే లబ్దిదారులందరి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని సీఎం జగన్ చెప్పారు.చర్చే జరగకుండా అడ్డుపడుతున్న టీడీపీ సభ్యులను అవసరమైతే మార్షల్స్ పెట్టి బయటకు పంపాలని ఆయన స్పీకర్ ను కోరారు.

తన అకౌంటబిలిటీ ఏమిటో ప్రజలకు తెలుసు.. చంద్రబాబు అకౌంటబిలిటీ కూడా ప్రజలకు తెలుసునని ఆయన ఎద్దేవా చేశారు.స్పీకర్ పోడియం వద్ద దళిత ఎమ్మెల్యేను ముందు పెట్టి కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు.

చంద్రబాబునాయుడు హయంలో  ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లింపు ఎక్కువగా ఉండేదన్నారు. కానీ ఇన్సూరెన్స్ విధానంలో మార్పులు వచ్చాయన్నారు. 2019 ఏడాదికి గాను రాష్ట్ర ప్రభుత్వం 1,030 కోట్ల ఇన్సూరెన్స్ ను  చెల్లించిందన్నారు. డిసెంబర్ 15న రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో 2016, 2017, 2018, 2019 లలో ఇన్సూరెన్స్ పరిధిలోకి వచ్చిన రైతుల వివరాలను సీఎం జగన్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు.
 

click me!