ఏరా చంద్రబాబుగా అనడానికి మాకెంత సేపు కావాలి... విరుచుకుపడ్డ నాని ద్వయం...

By AN TeluguFirst Published Dec 1, 2020, 10:17 AM IST
Highlights

తాడిచెట్టుకు.. పెద్దాయనకు వయసొచ్చిందన్నట్టు.. చంద్రబాబు ఇంగిత ఙానం కొల్పోయాడంటూ పేర్నినాని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ పై, వైసీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మంత్రులు నాని ద్వయం దుయ్యబట్టారు. 

తాడిచెట్టుకు.. పెద్దాయనకు వయసొచ్చిందన్నట్టు.. చంద్రబాబు ఇంగిత ఙానం కొల్పోయాడంటూ పేర్నినాని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ పై, వైసీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మంత్రులు నాని ద్వయం దుయ్యబట్టారు. 

ఆడూ వీడూ అని చంద్రబాబు బుద్ది ఙానం లేకుండా సీఎం, మంత్రుల గురించి మాట్లాడతారా..? ఏరా చంద్రబాబుగా అనడానికి మాకెంత సేపు కావాలి... అంటూ మంత్రి పేర్ని నాని ద్వజమెత్తారు. రైతుల గుండెల్లో బుల్లెట్లు దింపింది ఈ చంద్రబాబు కాదా..? రైతులకు పెట్టిన ప్రతి బకాయి మేం కడుతున్నాం. చంద్రబాబు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు.

రాజారెడ్డి రాజ్యాంగం ఏమిటీ..? చంద్రబాబు.. ఆయన కొడుక్కి ఖర్జూర నాయుడు రాజ్యాంగం కావాలేమో..? అసెంబ్లీ సమావేశాలంటే టీడీపీ సమావేశాలు కావని గుర్తుంచుకోవాలి. తుపాను వచ్చిన నెలన్నర లోపు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం.

రామానాయుడు పేరిచ్చి.. చంద్రబాబు మాట్లాడతానంటే ఎలా..? తన పేరునే చంద్రబాబు ఇవ్వొచ్చుగా..? కన్నబాబు కాపు కాబట్టి.. కాపు సామాజిక వర్గానికే చెందిన రామానాయుడు పేరు ఇచ్చారు.

మైనార్టీ ఎమ్మెల్యేను ఉద్దేశించి ఏం పీక్కుంటావో పీక్కొ అని చంద్రబాబు అనొచ్చా..?చంద్రబాబు రాజకీయాలకు స్వస్తి చెప్పి ఇంటికి పరిమితం అయితే బాగుంటుంది. చంద్రబాబు కుటుంబ సభ్యులు మా సూచనను పరిగణనలోకి తీసుకుంటే ఆయనకే మంచిదని పేర్నినాని అన్నారు. 

ఇక మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. చంద్రబాబుకు అల్జీమర్స్ జబ్బుంది. చంద్రబాబు పిచ్చి పరాకాష్టకు చేరింది.ఒరేయ్ చంద్రబాబు.. ఒళ్లు దగ్గర పెట్టుకో..సీఎంను ఇష్టానుసారంగా మాట్లాడితే తాట తీస్తాం.కుక్క బతుక్కి.. చంద్రబాబు బతుక్కి ఏమైనా తేడా ఉందా..?ఖర్జూర నాయుడు పేరు కానీ.. కిస్మిస్ నాయుడు పేరు కానీ మేం ఎత్తామా..?చంద్రబాబుది దిక్కుమాలిన బతుకు. అడుక్కు తినేవాళ్లు మెట్ల మీద కూర్చొన్నట్టు చంద్రబాబు కూర్చొన్నారు. ప్రజలు చంద్రబాబు బట్టలూడదీసినా బుద్ది లేకుండా వ్యవహరిస్తున్నారంటూ తిట్ల దండకం అందుకున్నారు. 

click me!