చంద్రబాబుపై మంత్రుల విమర్శలు.. మండిపడ్డ అచ్చన్న

Published : Dec 01, 2020, 10:10 AM IST
చంద్రబాబుపై మంత్రుల విమర్శలు.. మండిపడ్డ అచ్చన్న

సారాంశం

పంటల బీమా ఇన్సూరెన్స్ కట్టలేదని నిన్న ప్రభుత్వాన్ని నిలదీశామని టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత అచ్చెన్నాయుడు తెలిపారు. సభలో టీడీపీ అధినేత చంద్రబాబుని ఏకవచనంతో మాట్లాడే మంత్రులు మనుషులేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. ఒకరిపై మరొకరు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.  ఈ క్రమంలో అధికార పార్టీ నేతలు.. చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. చంద్రబాబుని కొందరు మంత్రులు ఏక వచనంతో కూడా సంభోదించారు. ఈ నేపథ్యంలో.. ఈ విషయంపై టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు.

పంటల బీమా ఇన్సూరెన్స్ కట్టలేదని నిన్న ప్రభుత్వాన్ని నిలదీశామని టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత అచ్చెన్నాయుడు తెలిపారు. సభలో టీడీపీ అధినేత చంద్రబాబుని ఏకవచనంతో మాట్లాడే మంత్రులు మనుషులేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇన్స్యూరెన్స్ కట్టామని ప్రభుత్వం సభలో సీఎం, వ్యవసాయ మంత్రి అవాస్తవాలు చెప్పారన్నారు. అర్ధరాత్రి ఆదరా బాదరాగా 590 కోట్లు ప్రీమియం చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న అర్ధరాత్రి జీవో ఇచ్చిన వాళ్లు పంటల బీమా ప్రీమియం చెల్లించామని ఎలా అబద్ధాలు చెప్పారని ప్రశ్నించారు. ఏవిధంగా రైతుల్ని ప్రభుత్వం మోసం చేసిందో గ్రహించాలని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Palle Panduga: గ్రామాల అభివృద్ధికి భారీ ప్రణాళిక.. రూ.11,085 కోట్ల పనులకు శ్రీకారం
ఉదయగిరిలో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | Palle Panduga 3.0 | Pawan Kalyan | Asianet News Telugu