సిఎం రమేష్ పై దాడి

Published : Apr 07, 2017, 12:05 PM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
సిఎం రమేష్ పై దాడి

సారాంశం

బద్ద విరోధైన ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకువచ్చింది నీవేనంటూ మండిపడ్డారు. అలాగే, మంత్రిపదవి రావటానికి కూడా నీవే కారణమంటూ కుర్చీలను ఎత్తి రమేష్ పైకి విసిరేసారు.

జమ్మలమడుగు టిడిపిలో అసమ్మతి ఇంకా చల్లారలేదు. సిఎం రమేష్ కు ఎదురైన చేదు అనుభవమే ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. ఈరోజు జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సమావేశం ఉద్దేశ్యం స్పష్టంగా తెలియలేదు. అయితే, ఆ సమావేశానికి సిఎం రమేష్ కూడా హాజరయ్యారు. అంతేకాకుండా రామసుబ్బారెడ్డితో పాటు వేదికపైనే కూర్చున్నారు. రమేష్ ను చూడగానే ఒక్కసారి కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలుతెంచుకున్నది.

రమేష్ పై మండిపడ్డారు. బద్ద విరోధైన ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకువచ్చింది నీవేనంటూ మండిపడ్డారు. అలాగే, మంత్రిపదవి రావటానికి కూడా నీవే కారణమంటూ కుర్చీలను ఎత్తి రమేష్ పైకి విసిరేయటం మొదలుపెట్టారు. పార్టీని నమ్ముకున్నందుకు తమకు మంచి శాస్తే జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆదినారాయణరెడ్డికి రమేష్ తొత్తుగా వ్యవహరిస్తు, రామసుబ్బారెడ్డిని అణగదొక్కుతున్నట్లు ధ్వజమెత్తారు. దాంతో ఒక్కసారిగా పరిస్ధితి ఉద్రిక్తతంగా మారింది. ఊహించని ఘటనతో రమేష్ బిత్తరపోయారు. రామసుబ్బారెడ్డి ఎంత వారించినా మద్దతుదారులు వెనక్కు తగ్గలేదు. దాంతో భద్రతా సిబ్బందికి సాయంగా  పోలీసులు రంగ ప్రవేశం చేసి రమేష్ ను అక్కడి నుండి సురక్షితంగా తరలించాల్సి వచ్చింది.భద్రతా సిబ్బంది సకాలంలో అడ్డుకోక పోతే రమేష్ కు బాగా ఇబ్బందయ్యేదే.

 

PREV
click me!

Recommended Stories

బీజేపీచేస్తున్న కుట్రను ఎదుర్కోడానికి రాహుల్ గాంధీని ఆహ్వానించాం | YS Sharmila | Asianet News Telugu
Varudu Kalyani Comments on Pawan Kalyan: డైలాగ్స్ వద్దు చర్యలు తీసుకోండి | Asianet News Telugu