లీకేజిలో సాక్షి హస్తం ఉందా?

Published : Mar 28, 2017, 12:05 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
లీకేజిలో సాక్షి హస్తం ఉందా?

సారాంశం

పేపర్ లీకైన పది నిముషాల్లోనే సాక్షి విలేకరి నుండి డిఇఒకు వాట్సప్ మెసేజ్ ఎలా వెళ్ళిందో తనకు ఆశ్చర్యంగా ఉందన్నారు.

ప్రశ్నపత్రాల లీకేజిలో సాక్షి విలేకరి హస్తం ఏమిటో తేలాలని చంద్రబాబునాయుడు అన్నారు. అసెంబ్లీలో 10వ తరగతి ప్రశ్నపత్రాల లీకేజిపై మాట్లాడుతూ పేపర్ లీకైన పది నిముషాల్లోనే సాక్షి విలేకరి నుండి డిఇఒకు వాట్సప్ మెసేజ్ ఎలా వెళ్ళిందో తనకు ఆశ్చర్యంగా ఉందన్నారు. పేపర్ లీకేజిలో ఏమన్నా కుట్ర ఉందా? లేకపోతే కేవలం కాకతాళీయమేనా అన్నది విచారణలో తేలుతుందన్నారు. పేపర్ లీకైతే ఒక్క సాక్షి విలేకరికి మాత్రమే ఎలా వెళ్లింది. మరీ పది నిముషాల్లోనే ఎలా వెళ్లిందనే విషయం విచారణలో తేలుతుందన్నారు. 

లీకేజి మొత్తం మీద  తెలుగుపండిట్ మహేష్ పాత్రమిటి? వాటర్ బయ్ ప్రవీణ్ పాత్రపైన కూడా విచారణ జరుగుతోందని చంద్రబాబు తెలిపారు. అసలు క్వశ్చన్ పేపర్ లీకేజిలోనే ఏమైనా కుట్రకోణం ఉందేమొనని కూడా సిఎం అనుమానం వ్యక్తం చేసారు. అన్నీ విషయాలూ విచారణలో బయటపడతాయని సిఎం ధీమా వ్యక్తం చేసారు. రాష్ట్రంలో క్రమశిక్షణ ఉండాలని అందుకు ఎవరిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించారు.

PREV
click me!

Recommended Stories

ఆంధ్రప్రదేశ్‌లోని ఈ చిన్న‌ గ్రామం త్వరలోనే మరో సైబరాబాద్ కానుంది, అదృష్టం అంటే వీళ్లదే
IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!