పేపర్ లీకేజీకి అమాయకుడెవరినో బలిచేసేలా ఉన్నారు

First Published Mar 28, 2017, 10:41 AM IST
Highlights

పేపర్ లీకయింది మంత్రి నారాయణ కాలేజీలో... విచారణ చేయాల్సిన  మంత్రి గంటా, నారాయణకు వియ్యంకుడు, ఆపై నారాయణ సిఎం నాయుడికి బినామీ

ఇక నిజం ఎట్లా బయటకొచ్చి చస్తుంది, అందుకే సిబిఐ విచారణ కావాలి: జగన్

లక్షలాది మంది విద్యార్థుల జీవితాలో ముడివడిన టెన్స్ ప్రశ్నా పత్రం లీక్ మీద ఈ రోజు అసంబ్లీలో పెద్ద రచ్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడ జగన్ విలేకరులతో ఇష్టాగోష్టి జరిపారు.   అక్కడ  ఈ వ్యవహారం మీద ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి:

 

ఈ రోజు 6 న్నరు లక్షల కుటుంబాలకి సంబంధించిన ప్రశ్నా పత్రం లీకేజీ వ్యహారం  లో ఏమాత్రం లెక్కజమ లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తాఉంది. దాన్ని ఎంతసేపూ దాచిపెట్టే  ప్రయత్నమే తప్ప పరిష్కరించే ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు  చెయ్యడం లేదు. ఈ ప్రశ్నా పత్రాల లీకేజీ ఇష్యూ లో తప్పు జరిగింది అని విద్యాశాఖే ఒప్పుకుంటుంది. గంటా అయితే ఢిల్లీ నుండి మాట్లాడుతూ అటెండర్ ఫోన్ ద్వారా లీక్ అయింది అని చెబుతున్నాడు. ఆ అటెండర్ ఏ కాలేజి కి చెందిన వాడో అందరికీ తెలుసు. ఆ కాలేజీ ఎవరిదో FIR కాపీయే చెబుతుంది. ఇలా ఇష్టమొచ్చినట్టు ప్రశ్నా పత్రాలు లీక్ చేస్తే కష్టపడి చదివిన విద్యార్థులకు కనీసం 100 వ రాంకైనా వస్తుందా?

 

ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వెయ్యరు. అది వేస్తేనే కదా మిగిలిన ఎన్ని కాలేజీలలో ఇలాంటి భాగోతాలు జరుగుతున్నాయో తెలుస్తాయి.

 

"చంద్రబాబు కి మంత్రి నారాయణ బినామీ అని చెబుతారు. నారాయణ కాలేజీ లో చంద్రబాబుకి వాటాలున్నాయని రూమర్స్ ఉన్నాయి. స్కామ్ జరిగిన కాలేజీ ఒకమంత్రి కి చెందినది.. దానిపై విచారణ జరిపించాల్సిన మరొక మంత్రి ఆయన వియ్యంకుడు. ఇది చాలదా ఈ కేసు ఎంతబాగా నడుస్తోంది అని చెప్పడానికి?.చిన్న చిన్న అధికారుల పైకో..అటెండర్ ల పైకో ఈ కేసు గెంటేసే ప్రయత్నం జరుగుతుంది.

 

అసలు ఈ కేసుపై చంద్రబాబు ఎందుకు స్పందించరు? చంద్రబాబు తరువాత ఎప్పుడో దీనిపై స్పందిస్తాననడం రోమ్ తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు ఉంది. బహుశా కాపీలు కొట్టిన నారాయణ విద్యార్థులకు 1st రాంకు వచ్చాక స్పందిస్తారేమో."

click me!