సీఎం జగన్ కుటుంబంలో విషాదం... మామ పెద్ద గంగిరెడ్డి మృతి

Arun Kumar P   | Asianet News
Published : Sep 06, 2020, 07:20 AM IST
సీఎం జగన్ కుటుంబంలో విషాదం... మామ పెద్ద గంగిరెడ్డి మృతి

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం నెలకొంది. 

పులివెందుల: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం నెలకొంది. ముఖ్యమంత్రి సతీమణి భారతిరెడ్డి  పెదనాన్న పెద్ద గంగిరెడ్డి(78) గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తాజాగా అతడు మృత్యువాతపడ్డారు. 

అనారోగ్యంతో బాధపడుతూ గంగిరెడ్డి కొద్దిరోజులుగా అనారోగ్యంతో పులివెందల ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే ఆరోగ్యం కాస్త మెరుగుపడటంతో ఇంటికి చేరుకున్నారు. కానీ శనివారం తెల్లవారుజామున హటాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురవడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే అతడు కన్నుమూశాడు. 

ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామమైన గోల్లలగూడూరుకు తరలించారు. ముఖ్యమంత్రి తల్లి విజయమ్మ, సతీమణి భారతిరెడ్డి గొల్లగూడూరుకు చేరుకుని గంగిరెడ్డి భౌతికకాయానికి నివాళి అర్పించారు. 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu