రేపు కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్.. ఇంద్రకీలాద్రిపై సెక్యూరిటీ ట్రయల్ రన్

By Sumanth KanukulaFirst Published Oct 1, 2022, 4:36 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదివారం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్నారు. మూలానక్షత్రం సందర్భంగా ఆదివారం సీఎం వైఎస్ జగన్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదివారం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో కీలకమైన మూలానక్షత్రం సందర్భంగా ఆదివారం సీఎం వైఎస్ జగన్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఇందుకోసం రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ ఇంద్రకీలాద్రికి చేరుకోకున్నారు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో..  ఇంద్రకీలాద్రిపై అధికారులు సెక్యూరిటీ ట్రయల్ రన్ నిర్వహించారు. 

ఇక, మూలానక్షత్రం సందర్భంగా ఆదివారం ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముంది. దాదాపు 3 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే రేపు వీఐపీ, వీవీఐపీ దర్శనాలు ఉండవని కలెక్టర్ ఢిల్లీ రావు వెల్లడించారు. భక్తల రద్దీ నేపథ్యంలో అర్దరాత్రి 1.30 గంట నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించనున్నట్టుగా చెప్పారు. 

Also Read: ఇంద్రకీలాద్రిపై మరోసారి దర్శనాల రచ్చ.. పోలీసు కుటుంబాల దర్శనాలపై సీపీ సీరియస్

ఇదిలా ఉంటే.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిస్తున్నాయి. అయితే దర్శనాల విషయంలో ఇంద్రకీలాద్రిపై మరోసారి రచ్చ చోటుచేసుకుంది. ప్రొటోకాల్ డైరెక్ట్ దర్శనాలతో గంటల కొద్దీ భక్తులు కూలైన్లలో నిరీక్షించాల్సి వస్తుంది. వీఐపీ టికెట్స్ ఉన్నప్పటికీ.. గంటలపాటు క్యూలైన్‌లో వేచి చూడాల్సి వస్తుందని పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ. 500 పెట్టి టికెట్ కొన్నా ఉపయోగం లేదంటూ మండిపడుతున్నారు. 

అయితే పోలీసు కుటుంబాలు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పాస్‌లు లేకున్నా ఐడీ కార్డులతో డైరెక్ట్‌గా దర్శనానికి వెళ్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో సామాన్య భక్తులు ఇబ్బంది పడాల్సి వస్తుందని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు నిన్నటి నుంచి దుర్గమ్మను దర్శించుకునేందుకు వీవీఐపీలు పెద్ద సంఖ్యలో తరలిరావడం కూడా సాధారణ భక్తులు ఇబ్బందికరంగా మారింది. 

click me!