తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. టైలర్ హబ్స్‌గా పేరు మార్పు..

Published : Oct 01, 2022, 03:59 PM IST
తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. టైలర్ హబ్స్‌గా పేరు మార్పు..

సారాంశం

తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. టీడీపీ ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేసిన కేటుగాళ్లు.. టైలర్ హబ్స్‌గా అకౌంట్ పేరును మర్చారు.

తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. టీడీపీ ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేసిన కేటుగాళ్లు.. టైలర్ హబ్స్‌గా అకౌంట్ పేరును మర్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులే టీడీపీ ట్విట్టర్ అకౌంట్‌లో కనిపిస్తున్నాయి. అయితే టీడీపీ ట్విట్టర్ ఖాతాను పునరుద్దరించేందకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 

ఇక, ఐటీడీపీ ట్విట్టర్ ఖాతా ద్వారా.. తెలుగుదేశం పార్టీ అధికారిక ఖాతా @JaiTDP హ్యాక్ అయినట్టుగా పేర్కొంది.  అధికార YSRCP మద్దతు ఉన్నవారే ఈ పనికి పాల్పడ్డారని ఆరోపించింది. త్వరలో తిరిగి వస్తామని పేర్కొంది. ఇదిలా ఉంటే.. గతంలో కూడా టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో టీడీపీ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన కేటుగాళ్లు.. పలు రకాల పోస్టులను చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్