చెన్నైకి చేరుకున్న చంద్రబాబు, డీఎంకే అధినేత కరుణానిధికి పరామర్శ

First Published Aug 4, 2018, 1:52 PM IST
Highlights

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని కావేరీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయనను ఇవాళ ఉదయం ఏపి సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇవాళ ఉదయమే చెన్నైకి బయలుదేరిన చంద్రబాబు నేరుగా కావేరీ ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ స్టాలిన్ ను కలుసుకుని చికిత్స పొందుతున్న కరుణానిధిని పరామర్శించారు. 

కరుణానిధి ఆరోగ్య పరిస్థితి గురించి చంద్రబాబు ఆయన తనయుడు స్టాలిన్, కూతురు కనిమొళిని అడిగి తెలుసుకున్నారు. కరుణానిధి ఆరోగ్యం రోజు రోజుకు మెరుగుపడుతోందని స్టాలిన్ చంద్రబాబుతో తెలిపారు. సీఎం పాటు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వీరమస్తాన్ రావు కావేరీ ఆస్పత్రిలో కరుణానిధిని పరామర్శించారు. 

తీవ్ర అస్వస్థతతో వారం రోజుల క్రితం కరుణానిధి కావేరీ ఆస్పత్రిలో చేరారు. అప్పటినుండి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. ఆయనను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడితో పాటు కేరళ సీఎం పినరయి విజయన్, తమిళనాడు సీఎం పళని స్వామి తో పాటు పలువురు ప్రముఖులు పరామర్శించారు. 

తమ ప్రియతమ నాయకుడు కరుణానిధి ఆరోగ్యం బాగుపడాలని డీఎంకే కార్యకర్తలు ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన నాటి కంటే ఇప్పుడు కరుణానిధి ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని డాక్టర్లు చెబుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన బులెటిన్ ను కూడా విడుదల చేశారు.

సంబంధిత వార్తల కోసం కింంది లింక్ క్లిక్ చేయండి

https://telugu.asianetnews.com/national/rahul-gandhi-visits-dmk-chief-karunanidhi-at-kauvery-hospital-pcqf0y

https://telugu.asianetnews.com/national/ilayaraja-sings-song-for-karunanidhi-pco7c1

 https://telugu.asianetnews.com/national/dmk-chief-responding-to-treatment-says-son-mk-stalin-urges-cadre-to-not-indulge-in-violence-pcnxn8

https://telugu.asianetnews.com/national/karunanidhi-s-supporters-refuse-to-budge-from-hospital-premises-pcnqsv

click me!