దేవినేని ఉమకు మరోసారి సిఐడి నోటీసులు...

By Arun Kumar PFirst Published Apr 30, 2021, 12:51 PM IST
Highlights

విచారణ నిమిత్తం మరోసారి మంగళగిరి సిఐడి కార్యాలయానికి రావాలని మాజీ మంత్రి దేవినేని ఉమకు సిఐడి మరోసారి నోటీసులు జారీ చేసింది.  

అమరావతి: టిడిపి సీనియర్ నాయకులు, మాజీ మంత్రి దేవినేని ఉమ కు మరోసారి సిఐడి నోటీసులు జారీ చేసింది. రేపు(శనివారం) ఉదయం 11గంటలకు మరోసారి తమఎదుట విచారణకు హాజరు కావాలని సిఐడి నోటీసుల్లో పేర్కొంది. మంగళగిరి సిఐడి కార్యాలయంలో హాజరు కావాలని దేవినేనికి సూచించారు సిఐడి అధికారులు. 

నిన్న(గురువారం) మంగళగిరి కార్యాలయంలో తొమ్మిది గంటల పాటు దేవినేని ఉమను విచారించారు సీఐడి అధికారులు. సీఎం వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు వీడియో మార్ఫింగ్ అభియోగాలపై పలు ప్రశ్నలు సంధించారు. అయితే నిన్న దేవినేని ఉమ ఇచ్చిన సమాధానాలపై సంతృప్తి చెందని సీఐడీ అధికారులు రేపు మరోసారి విచారించడానికి సిద్దమయ్యారు. 

read more  జగన్ మార్ఫింగ్ వీడియో కేసు: దేవినేని ఉమకు హైకోర్టు షాక్

నిన్న సిఐడి కార్యాలయంలో విచారణ అనంతరం ఉమ మాట్లాడుతూ... హైకోర్టు ఆదేశాలను గౌరవించే సీబీఐ ఆఫీస్ కి వచ్చానన్నారు. కరోనా సోకినవారు ఫోన్ లు చేసి ఒక్క బెడ్ ఇప్పించండి అని ప్రాధేయపడుతున్నారన్నారు. బందరులో మంత్రి చాలా పెద్డ పెద్డ కబుర్లు చెబుతున్నాడని మండిపడ్డారు. అధికారులు, పోలీసులు కేసులంటూ తిరుగుతున్నారని... ప్రజలను పట్టించుకునే వాళ్ళు లేరని ఉమ మండిపడ్డారు. 

''ముఖ్యమంత్రి కి  రెండు గంటలు క్యాబినెట్ మీటింగ్ లో కూర్చుంటే కరోనా వస్తుందేమో అని భయం.. మీకే అలా ఉంటే విద్యార్థుల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. కేంద్ర సంస్థల కంటే నువ్వు ఏమైనా తెలివిగలవాడివా?'' అని ప్రశ్నించారు. 

 దొంగల పేరుతో నోటీసులు ఇస్తారా..? డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్  ఇచ్చిన స్వేచ్ఛ భావన ప్రకటన హక్కు కు ఏ మాత్రం గౌరవం లేదా.. చట్టాలను చుట్టలుగా చేసుకొని పరిపాలన చేస్తున్నారు అంటూ ఉమ ధ్వజమెత్తారు.

click me!