టెన్త్,ఇంటర్ పరీక్షలపై పున:పరిశీలించండి: ఏపీ సర్కార్‌కి హైకోర్టు సూచన

By narsimha lode  |  First Published Apr 30, 2021, 12:19 PM IST

: టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ విషయాన్ని పున:పరిశీలన చేయాలని ఏపీ హైకోర్టు రాష్ట్రప్రభుత్వానికి సూచించింది.


అమరావతి: టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ విషయాన్ని పున:పరిశీలన చేయాలని ఏపీ హైకోర్టు రాష్ట్రప్రభుత్వానికి సూచించింది.శుక్రవారం నాడు  ఏపీ హైకోర్టులో రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై దాఖలైన పిటిషన్లపై  విచారణ సాగింది.పక్క రాష్ట్రాల్లో పరీక్షలను వాయిదా వేస్తే మీరేలా పరీక్షలను నిర్వహిస్తారని ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

als read:జగన్‌కు షాక్: టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయండి.. హైకోర్టుకెక్కిన తల్లిదండ్రులు

Latest Videos

 

 

టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ విషయాన్ని పున:పరిశీలన చేయాలని ఏపీ హైకోర్టు రాష్ట్రప్రభుత్వానికి సూచించింది.శుక్రవారం నాడు ఏపీ హైకోర్టులో రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై దాఖలైన పిటిషన్లపై విచారణ సాగింది pic.twitter.com/QxW9ZPXm9o

— Asianetnews Telugu (@AsianetNewsTL)

లక్షలమంది విద్యార్ధుల జీవితాలకు సంబంధించిన విషయమని ఏపీ హైకోర్టు అభిప్రాయపడింది. కరోనా వచ్చిన విద్యార్ధులు హోం ఐసోలేషన్ లో ఉండాలి కదా, పరీక్షలు ఎలా రాస్తారని హైకోర్టు ప్రశ్నించింది. వారికి  ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది.  ఇదెలా సాధ్యమని హైకోర్టు ప్రశ్నించింది. దాదాపుగా 30 లక్షల మంది టీచర్లు, విద్యార్ధులు పరీక్షల్లో భాగం కావాల్సి ఉంటుందని  హైకోర్టు గుర్తు చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాలని  హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఈ పిటిషన్లపై విచారణను  మే 3వ తేదీకి వాయిదా వేసింది. 

also read:టెన్త్ పరీక్షలపై వెనక్కి తగ్గని వైఎస్ జగన్: భవిష్యత్తుకు నష్టమని వాదన

ఏపీ రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ విద్యార్ధులకు ఈ ఏడాది షెడ్యూల్ ప్రకారంగానే ఎన్నికలు నిర్వహిస్తామని  ప్రభుత్వం ప్రకటించింది.  విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే  పరీక్షల నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నామని ప్రభుత్వం ప్రుకటించింది. అయితే రాష్ట్రంలో  టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని  విపక్షాలు  డిమాండ్ చేస్తున్నాయి.

click me!