నోట్ల మార్పిడి కేసులో అరెస్టైన సీఐ స్వర్ణలత.. సినిమాలు, డ్యాన్స్ రీల్స్.. ట్విస్టులే ట్విస్టులు....

By SumaBala Bukka  |  First Published Jul 8, 2023, 6:47 AM IST

ఏపీలో నోట్ల మార్పిడి కేసులో అరెస్టైన సీఐ స్వర్ణలత కేసులో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆమెకు సినిమాలు అంటే పిచ్చి అని.. దీనికోసమే డ్యాన్స్ రీల్స్ కూడా చేస్తుందని తెలుస్తోంది. 


విశాఖపట్నం :  ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఓ ఆర్మ్ డ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నోట్ల మార్పిడి కేసులో కొందరు వ్యక్తులను బెదిరించి లక్షల్లో డబ్బులు గుంజిన కేసులో ఆమె  అరెస్ట్ అయింది. ఆర్మ్ డ్ రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత అరెస్టు పోలీసు శాఖలో సంచలనంగా మారింది. ఆమె మీద ఐపీఎస్ లోని పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి. ఏఆర్ హోంగార్డ్ ఎస్సైగా పనిచేస్తున్నప్పటి నుంచే ఆమె మీద అనేక ఆరోపణలు ఉన్నాయి.  అయితే ఇప్పుడు ఈ స్వర్ణలతకు  సంబంధించి మరో విషయం వెలుగు చూస్తోంది. 

ఆమెకి సినిమాల్లో నటించడం ఇష్టమని. ‘ఏపీ 31’  అనే ఓ సినిమాలో నటిస్తోందని.. దీనికి సంబంధించిన పోస్టర్ వెలుగు చూసింది. గతంలో హోంగార్డు నియామకాల్లో అవకతవకలకు పాల్పడినట్లుగా  ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె విజయవాడకు బదిలీ అయింది. అక్కడ కొంతకాలం పని చేసిన తర్వాత శ్రీకాకుళం ఏఆర్ కు వచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులు వేరే చోట పనిచేసిన వైసిపి నేతల సిఫార్సుతో విశాఖపట్నం వచ్చారు.

Latest Videos

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన రిటైర్డ్ ఎస్పీజీ అధికారి.. ఎవరీ పీసీ స్వామి..?

మొదట సిటీ ట్రైనింగ్ సెంటర్లో కొంతకాలం పనిచేసి ఆ తర్వాత హోంగార్డుల రిజర్వ్ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ)గా బాధ్యతలు చేపట్టింది. మొదటి నుండి స్వర్ణలతకు సినిమాల మీద ఆసక్తి. ఈ క్రమంలోనే తాను చేస్తున్న ఉద్యోగం గురించి కూడా మరిచిపోయి… కొంత కాలం క్రితం ఓ పాటకు డాన్స్ చేస్తూ వీడియో తీసింది.  దీన్ని రీల్ గా సోషల్ మీడియాలో పెట్టింది.  దీనికి చిరు ప్రయత్నం అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఒక ప్రజా ప్రతినిధి  తాను తీయబోయే  సినిమాలో  మంచి పాత్ర ఇస్తానని చెప్పడంతో కొరియోగ్రాఫర్ ని కూడా పెట్టుకుని డాన్స్  ప్రాక్టీస్ చేస్తోంది. ఈ క్రమంలోనే  ఆమె డాన్స్ కు సంబంధించిన అనేక వీడియోలు  వెలుగు చూశాయి. 

వైసీపీ నేతలతో స్వర్ణలత తన పరిచయాలు బాగా పెంచుకుంది. ఈ క్రమంలోనే గత జీవీఎంసీ ఎన్నికల్లో ఆమె బంధువైన ఓ మహిళ అభ్యర్థి తరఫున ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో ఈ మేరకు ఆరోపణలు వెల్లువెత్తాయి. నోట్ల మార్పిడి కేసులో స్వర్ణలత అరెస్ట్ అయిన తరువాత... అయితే ఆమె మీద కేసు పెట్టకుండా ఉండాలని ఆమెకు సన్నిహితుడైన ఓ కీలక ప్రజా ప్రతినిధి  విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలా కాకపోతే కనీసం ఆమె మీద పెట్టిన కేసు తీవ్రత తగ్గించేలా ఒత్తిళ్లు తీసుకువచ్చారు. దీన్నిబట్టి స్వర్ణలతకు రాజకీయంగా ఎంత మద్దతు ఉందో అర్థమవుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

గతంలో స్వర్ణలత టిడిపి నేతపై ప్రెస్ మీట్ పెట్టి మరీ విడుచుకుపడ్డారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పై పంచ్ డైలాగ్స్ తో ప్రెస్ మీట్ పెట్టారు. పోలీసులకు రాజకీయాలు ముడిపెట్టి మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు. ఇప్పుడు స్వర్ణలత నటిస్తున్న ‘ఏపీ 31’  సినిమాకు సంబంధించిన వ్యవహారాల్లో పర్యవేక్షణలోనూ ఆమె భాగస్వామి అయినట్టుగా సమాచారం. దీని కోసమే నోట్ల మార్పిడిలో కీలకంగా వ్యవహరించారా అన్న ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తలెత్తుతున్నాయి. స్వర్ణలతకు కొందరు రియాల్టర్లతోను పరిచయాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే నోట్లు మార్పిడి చేసుకోవాలని చూసేవారికి.. కమిషన్ తీసుకుని కొన్ని ఫ్లాట్లు కూడా ఆమె బుక్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి.

click me!