పులివెందులలో జగన్‌కు ఓటమి ఖాయం.. సొంత బాబాయిని చంపాడు: చంద్రబాబు

By Mahesh K  |  First Published Jul 7, 2023, 8:29 PM IST

సీఎం జగన్ పై చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ ఈ సారి ఎన్నికల్లో పులివెందులలో గెలవలేడని, ఆయన ఓడిపోవడం ఖాయమని అన్నారు. సొంత బాబాయిని చంపిన జగన్‌కు ఎవరూ ఓటేయరని పేర్కొన్నారు.
 


అమరావతి: టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందులలో జగన్ ఓడిపోవడం ఖాయం అని జోస్యం చెప్పారు. అన్న తినే వారెవరూ జగన్‌కు ఓటేయరని పేర్కొన్నారు. జగన్ తన సొంత బాబాయిని చంపేశాడని ఆరోపణలు చేశారు. అలాంటి వ్యక్తికి ఓటు ఎవరూ వేయరని అన్నారు.

నాలుగేల్లుగా నరకాన్ని అనుభవిస్తున్నామని, అమ్మ ఒడి పథకం ఒట్టి బూటకమని చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వం పేదలపై రూ. 51 వేల కోట్ల మేరకు విద్యుత్ భారం వేశారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే కరెంట్ చార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. టమాట ధర కిలోకు రూ. 200కు పెరిగిందని పేర్కొంటూ తాను టీడీపీ హయాంలో ధరలను నియంత్రించామని వివరించారు. ఉల్లిపాయల ధరలు పెరిగితే వాటిని నాసిక్ నుంచి తెప్పించానని గుర్తు చేశారు. 

Latest Videos

ఫిష్ మార్కెట్ పెట్టి ఉద్యోగాలు సృష్టించానని చెప్పే సీఎం ఒక్క జగనే అని విమర్శించారు. అంతేకాదు, చెత్తపై చెత్త పన్ను వేసిన చెత్త సీఎం కూడా ఆయనే అని మండిపడ్డారు.

Also Read: చిరుత దాడికి గురైన బాలుడిని శ్రీవారే రక్షించారు: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే యేటా మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తామని వివరించారు. తల్లికి వందనం పథకం తెచ్చి ఎంత మంది పిల్లలు ఉంటే వారందరికీ యేటా రూ. 15 వేల చొప్పున అందిస్తామని చెప్పారు. అంతేకాదు, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని వివరించారు. పేదలను ధనికులను చేయడానికి పూర్ టు రిచ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తామని చెప్పారు.

click me!