రామతీర్థం అచ్యుతానందగిరి స్వామి హత్య: నిందితుడి అరెస్ట్

By narsimha lode  |  First Published Feb 17, 2021, 3:25 PM IST

చిత్తూరు జిల్లాలోని రామతీర్థం అచ్యుతానందగిరి స్వామి హత్య కేసును పోలీసులు చేధించారు. స్వామిజీని హత్య చేసిన నిందితుడిని పోలీసులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. పాత నేరస్తుడే స్వామిజీని హత్య చేసినట్టుగా పోలీసులు తేల్చారు.


చిత్తూరు:చిత్తూరు జిల్లాలోని రామతీర్థం అచ్యుతానందగిరి స్వామి హత్య కేసును పోలీసులు చేధించారు. స్వామిజీని హత్య చేసిన నిందితుడిని పోలీసులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. పాత నేరస్తుడే స్వామిజీని హత్య చేసినట్టుగా పోలీసులు తేల్చారు.

చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలం గుండ్లపల్లె సమీపంలోని శ్రీరామతీర్థసేవాశ్రమంలో  అచ్యుతానందగిరి స్వామిని ఈ ఏడాది జనవరి 28వ తేదీన హత్యకు గురయ్యాడు.

Latest Videos

undefined

60 ఏళ్ల క్రితం ఈ ఆశ్రమాన్ని స్వామి ఏర్పాటు చేశారు. తవణంపల్లె మండలం దిగువమాఘం గ్రామానికి చెందిన పూర్ణ చంద్రారెడ్డి ఇరవై ఏళ్ల పరిపూర్ణానందస్వామి దగ్గర సన్యాస దీక్ష తీసుకొన్నారు. ఆ తర్వాత కొన్నేళ్లపాటు ఆశ్రమాలలో గడిపి శ్రీరామతీర్థ సేవాశ్రమానికి చేరుకొన్నారు.

 

చిత్తూరు జిల్లాలోని రామతీర్థం అచ్యుతానందగిరి స్వామి హత్య కేసును పోలీసులు చేధించారు. స్వామిజీని హత్య చేసిన నిందితుడిని పోలీసులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. పాత నేరస్తుడే స్వామిజీని హత్య చేసినట్టుగా పోలీసులు తేల్చారు. pic.twitter.com/0HTT7F0kHU

— Asianetnews Telugu (@AsianetNewsTL)

ఆశ్రమంలోని శివాలయంలో నిత్యం పూజలు చేసేవాడు. లక్ష్మమ్మ అనే వృద్దురాలు ఆయనకు సహయంగా ఉండేది. జనవరి 26 తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి హత్య చేశాడు. ఈ డాదిలో స్వామి మరణించాడు.

ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకొన్నారు. ఘటన స్థలంలో దొరికిన ఆధారాలను బట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. పాత నేరస్తుడు బత్తల రామచంద్ర హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.  డబ్బు కోసమే హత్య చేసినట్టుగా పోలీసుల విచారణలో నిందితుడు ఒప్పుకొన్నాడు. నిందితుడి నుండి రూ. 50 వేల నగదును, బైక్ ను స్వాధీనం చేసుకొన్నారు.

click me!