విశాఖపట్టణంలోని శారదా పీఠం వార్షిక మహోత్సవాల్లో బుధవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.
విశాఖపట్టణం: విశాఖపట్టణంలోని శారదా పీఠం వార్షిక మహోత్సవాల్లో బుధవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.
విశాఖ ఎయిర్ పోర్టులో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నేతలతో సమావేశం ముగిసిన తర్వాత జగన్ నేరుగా శారదా పీఠానికి చేరుకొన్నారు.శారదా పీఠం వార్షిక ఉత్సవాలను పురస్కరించుకొని రాజశ్యామల యాగంం నిర్వహించారు.ఈ యాగంలో సీఎం జగన్ పాల్గొన్నారు. రాజశ్యామల అమ్మవారికి సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
undefined
విశాఖ శారదా పీఠం నిర్వహించే ప్రతి కార్యక్రమంలో జగన్ క్రమం తప్పకుండా పాల్గొంటున్నారు. ఏపీ రాష్ట్ర విపక్ష నాయకుడిగా ఉన్న సమయం నుండి జగన్ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడ శారద పీఠం నిర్వహించే కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు.
విశాఖ శారద పీఠంలో నిర్వహించే వార్షిక ఉత్సవాల్లో జగన్ పాల్గొనే విషయమై చంద్రబాబునాయుడు మంగళవారం నాడు విమర్శలు గుప్పించారు. దొంగస్వామి వద్దకు జగన్ వెళ్లి వంగి వంగి దండాలు పెడతారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.