విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నిరసిస్తూ అసెంబ్లీలో తీర్మానం: జగన్

By narsimha lode  |  First Published Feb 17, 2021, 3:14 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ అసెంబ్లీలో తీర్మాణ: చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
 



విశాఖపట్టణం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ అసెంబ్లీలో తీర్మాణ: చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.

బుధవారం నాడు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితీ నేతలు విశాఖ ఎయిర్ పోర్టులో సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లో కూడిన వినతిపత్రాన్ని సీఎం జగన్ కు అందించారు నేతలు.

Latest Videos

undefined

also read:విశాఖ శారద పీఠం వార్షిక ఉత్సవాలు: ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం జగన్

ఎన్‌ఎండీసీని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీతో అనుసంధానం చేయాలని నేతలు కోరారు. దీంతో ఇనుప ఖనిజం సమస్య తీరనుందని నేతలు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.ఈ విషయాన్ని కేంద్రాన్ని ఒప్పించాలని నేతలు సీఎంను కోరారు.

సుమారు గంటకు పైగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకొనే విషయమై చర్చించారు.  విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో సీఎంతో పాటు మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, కన్నబాబు, ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
 

click me!