మాస్క్ ధరించలేదని చితకబాదిన ఎస్సై... యువకుడు మృతి

By Arun Kumar PFirst Published Jul 22, 2020, 10:24 AM IST
Highlights

కరోనా విజృంభణ వేళ మాస్కు ధరించకుండా ఇంట్లోంచి బయటకు వచ్చిన ఓ యువకుడిని పోలీసులు చితకబాదిన సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. 

ప్రకాశం: కరోనా విజృంభణ వేళ మాస్కు ధరించకుండా ఇంట్లోంచి బయటకు వచ్చిన ఓ యువకుడిని పోలీసులు చితకబాదిన సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. చీరాల ఎస్సై ఓవరాక్షన్ కారణంగానే యువకుడు చనిపోయినట్లు తెలస్తోంది. 

ఈ నెల 19వ తేదీని కరణ్ కుమార్ అనే యువకుడు మాస్క్ లేకుండా బైక్ పై వెళుతుండగా చీరాల టూటౌన్ ఎస్సై విజయ్ కుమార్ ఆపారు. అతడు వచ్చిరాగానే బైక్ పై వుండగానే ఎస్సై లాఠీతో చితకబాదడం ప్రారంభించాడు. దీంతో కరణ్ బైక్ పై నుండి కిందపడిపోగా తలకు తీవ్ర గాయమయ్యింది. 

read more   తల్లి రెండో పెళ్లి.. అన్న ఇంటికి వెళితే.. వదిన కాలనాగులా..

దీంతో కుటుంబసభ్యులు అతడిని చికిత్స నిమిత్తం గుంటూరుకు తరలించారు. అయితే అప్పటినుండి చికిత్స పొందుతున్న యువకుడి పరిస్థితి తాజాగా విషమించి మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.

కరోనా నియంత్రణ కోసం పోలీసులు కఠినంగా వ్యవహరించాలి కానీ ఇలా ప్రాణాలు తీసేంత కఠినంగా కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. యువకుడి చావుకి కారణమైన చీరాల ఎస్సై వ్యవహరించిన తీరుపై మృతుడి కుటుంబసభ్యులే కాదు ప్రజలకు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

  

click me!