విజయసాయికి కరోనా..చాలా బాధాకరమన్న బుద్దా వెంకన్న

Published : Jul 22, 2020, 09:21 AM ISTUpdated : Jul 22, 2020, 09:24 AM IST
విజయసాయికి కరోనా..చాలా బాధాకరమన్న బుద్దా వెంకన్న

సారాంశం

నిత్యం సోషల్ మీడియాలో విజయసాయి, బుద్దా వెంకన్న విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే.. విజయసాయి కరోనా బారిన పడ్డారనగానే.. బుద్ధా ఆయన క్షేమం కోరుకోవడం అందరినీ ఆకట్టుకుంటోంది.  

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కి కరోనా సోకిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయనకు కరోనా సోకడంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా స్పందించారు. విజయసాయి త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని బుద్ధా ట్విట్టర్ లో పేర్కొన్నారు.

‘‘రాజకీయంగా ట్విట్టర్ ప్రత్యర్థులమే తప్ప వ్యక్తిగతంగా మా మధ్య ఎటువంటి గట్టు తగాదా లేదు. ఎంపీ విజయసాయిరెడ్డి గారు కనికరం లేని కరోనా బారిన పడటం బాధాకరం. ఆయన కరోనా నుండి త్వరగా కోలుకుని ట్విట్టర్‌లో యాక్టివ్ అవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను’’ అంటూ బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు.

నిత్యం సోషల్ మీడియాలో విజయసాయి, బుద్దా వెంకన్న విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే.. విజయసాయి కరోనా బారిన పడ్డారనగానే.. బుద్ధా ఆయన క్షేమం కోరుకోవడం అందరినీ ఆకట్టుకుంటోంది.

 

ఇదిలా ఉండగా.. విజయసాయి రెడ్డి ప్రస్తుతం హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో గల అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  గత కొద్ది రోజులుగా అస్వస్థతగా ఉండడంతో పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు కరోనా సోకినట్లు మంగళవారం నిర్ధారణ అయింది.

విజయసాయి రెడ్డికి కరోనా వైరస్ సోకినట్లు ఓ ఆంగ్లదినపత్రిక తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ఆ తర్వాత విజయసాయి రెడ్డి స్వయంగా ఓ ట్వీట్ చేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో అత్యంత జాగ్రత్తలో భాగంగా తనంత తానుగా వారం నుంచి పది రోజుల క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ సమయంలో అత్యవసర పరిస్థితుల్లో తప్ప టెలిఫోన్ కు కూడా అందుబాటులో ఉండనని చెప్పారు. అయితే, తనకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు మాత్రం చెప్పలేదు. 

ఇదిలావుంటే, విజయసాయి రెడ్డి వ్యక్తిగత సహాయకుడికి కూడా కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న కాలంలో విజయసాయి రెడ్డి అమరావతి, విశాఖపట్నం, హైదరాబాదుల మధ్య విస్తృతంగా పర్యటించారు. ఇటీవలి కాదా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు పలువురు ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. పలు సందర్భంగాల్లో మాస్కు లేకుండా కూడా కనిపించారు. 


 

PREV
click me!

Recommended Stories

Rain Alert: తెలుగు రాష్ట్రాల‌పై ద్రోణి ప్ర‌భావం.. ఈ ప్రాంతాల్లో పిడుగుల‌తో కూడిన భారీ వ‌ర్షం, జాగ్ర‌త్త
Pemmasani Chandrasekhar:పోస్టల్ డెలివరీలను 24గంటల్లో పూర్తిచేయడమే దీని లక్ష్యం | Asianet News Telugu