ఉద్యోగం కోసం ఆసుపత్రిలోనే పరీక్ష రాసిన కరోనా రోగి

By narsimha lodeFirst Published Jul 22, 2020, 10:13 AM IST
Highlights

ఉద్యోగం కోసం కరోనాతో చికిత్స పొందుతున్న బాధితుడు మంగళవారం నాడు పరీక్ష రాశాడు. ఆసుపత్రిలోనే బాధితుడు పరీక్ష రాశాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకొంది.

చిత్తూరు: ఉద్యోగం కోసం కరోనాతో చికిత్స పొందుతున్న బాధితుడు మంగళవారం నాడు పరీక్ష రాశాడు. ఆసుపత్రిలోనే బాధితుడు పరీక్ష రాశాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకొంది.

జిల్లాలోని క్షయ విభాగంలోని ఆర్ఎస్‌టీసీపీ కింద కొన్ని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గత ఏడాది నోటిఫికేషన్  విడుదల చేసింది ప్రభుత్వం. అయితే అప్పట్లోనే ఆ ప్రక్రియ పూర్తి చేసింది. అయితే కొందరికి ఉద్యోగాలు రాలేదు. దీంతో నోటిఫికేషన్ రద్దు చేశారు. ఆ నోటిఫికేషన్ లో మార్పులు చేర్పులు చేశారు. మార్పులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. 

also read:తిరుమలకు కరోనా దెబ్బ: సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత

కొత్త నోటిఫికేషన్ ఆధారంగా మంగళవారం నాడు పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ పరీక్షలు రాసేందుకు క్షయ విభాగంలో కాంట్రాక్టు పద్దతిలో పనిచేసే ఓ వ్యక్తి ధరఖాస్తు చేసుకొన్నాడు. ధరఖాస్తు చేసుకొనే సమయానికి ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు. కానీ ప్రస్తుతం ఆయనకు కరోనా సోకింది. కరోనా కోసం చికిత్స కోసం చిత్తూరులోని జిల్లా కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

ఈ పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన ఉన్నతాధికారులను కోరారు. అయితే ఆయనకు ఉన్నతాధికారుల నుండి పరీక్షలు రాసేందుకు అనుమతి లభించింది. 

మంగళవారం నాడు అతనికి కరోనా పరీక్షలు నిర్వహించారు.ఈ పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ వచ్చినట్టుగా జిల్లా క్షయ నివారణ విభాగం అదికారి రమేష్ బాబు చెప్పారు. జిల్లా వైద్యాధికారి అనుమతితోనే అతడిని పరీక్షకు హాజరయ్యారని ఆయన వివరించారు. జిల్లా ఆసుపత్రిలోని సమావేశ మందిరంలో ఆయన పరీక్ష రాశాడ.

click me!