శిద్దాతో భేటీ: చంద్రబాబు భేటీ తర్వాతే ఆమంచి నిర్ణయం

By narsimha lodeFirst Published Feb 7, 2019, 11:16 AM IST
Highlights

చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గురువారం నాడు మంత్రి శిద్దా రాఘవరావుతో భేటీ అయ్యారు. ఆమంచి కృష్ణమోహన్  పార్టీని వీడుతారనే ప్రచారం సాగుతున్న తరుణంలో బాబుతో భేటీకి రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది

అమరావతి: చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గురువారం నాడు మంత్రి శిద్దా రాఘవరావుతో భేటీ అయ్యారు. ఆమంచి కృష్ణమోహన్  పార్టీని వీడుతారనే ప్రచారం సాగుతున్న తరుణంలో బాబుతో భేటీకి రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది

రెండు రోజుల క్రితం చీరాల నియోజకవర్గంలోని పందిళ్లపల్లిలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ భేటీ అయ్యారు. వైసీపీలో చేరాలని భావించారు. అదే రోజు సాయంత్రం  మంత్రి  శిద్దా రాఘవరావు కలిసి ఆమంచి కృష్ణమోహన్‌‌ను బుజ్జగించారు.

దీంతో బుధవారం నాడు జగన్‌ను కలిసి వైసీపీలో చేరాల్సిన ఆమంచి కృష్ణమోహన్ చంద్రబాబునాయుడును కలవాలని నిర్ణయం తీసుకొన్నారు. కానీ, బుధవారం నాడు ఆమంచి కృష్ణమోహన్ మాత్రం టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులతో భేటీ అయ్యారు.

గురువారం నాడు ఉదయం  అసెంబ్లీలో మంత్రి శిద్దా రాఘవరావుతో భేటీ అయ్యారు. సీఎంను కలిసేందుకు తాను వచ్చినట్టు ఆమంచి కృష్ణమోహన్ చెప్పారు.సీఎం పిలిస్తేనే తాను వచ్చినట్టు ఆమంచి కృష్ణమోహన్ చెప్పారు.  సీఎం అంటే తనకు చాలా గౌరవం ఉందని ఆమంచి చెప్పారు.

చీరాల నియోజకవర్గంలో  మాజీ మంత్రి పాలేటీ రామారావు, ఎమ్మెల్సీ పోతుల సునీత వర్గీయుల కారణంగా తనకు ఇబ్బందులు ఉన్న విషయాన్ని  గతంలో కూడ చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చినట్టు ఆమంచి చెబుతున్నారు.  అయితే ఈ ఇబ్బందులు ఇంకా తొలగిపోలేదని ఆమంచి చెప్పారు. 

ప్రస్తుతం అసెంబ్లీలో మంత్రి శిద్దా రాఘవరావుతో  ఎమ్మెల్యే ఆమంచి రాఘవరావు భేటీ అయ్యారు. మంత్రి శిద్దాతో కలిసి ఆమంచి కృష్ణారావు చంద్రబాబును కలవనున్నారు.బాబుతో భేటీ తర్వాత ఆమంచి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది

సంబంధిత వార్తలు

సీన్ రివర్స్: చంద్రబాబుతో భేటీ కానున్న ఆమంచి

టీడీపీ బుజ్జగింపులు: ఆమంచి ఇంటికి మంత్రి శిద్దా రాఘవరావు

click me!