‘‘అల్జీమర్స్’’ అనుకుంటా: చంద్రబాబుపై ఆమంచి సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Feb 13, 2019, 12:20 PM IST
Highlights

వైసీపీలో చేరికపై తాను జగన్‌కు ఎలాంటి షరతులు పెట్టలేదని, జగన్ సైతం తనకు ఎలాంటి హామీలు ఇవ్వలేదన్నారు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్.. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ లోటస్ పాండ్‌లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు.

వైసీపీలో చేరికపై తాను జగన్‌కు ఎలాంటి షరతులు పెట్టలేదని, జగన్ సైతం తనకు ఎలాంటి హామీలు ఇవ్వలేదన్నారు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్.. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ లోటస్ పాండ్‌లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు.

భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, అభివృద్దిపైనే తామిద్దరం చర్చలు జరిపినట్లు తెలిపారు. మూడున్నర సంవత్సరాల పాటు పార్టీలో జరిగిన పరిణామాలు తనను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయని, కార్యకర్తల సూచన మేరకు టీడీపీకి రాజీనామా చేసినట్లు ఆమంచి వెల్లడించారు.

ప్రభుత్వంతోనూ, పార్టీతోనూ ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు చంద్రబాబును తరచూ కలుస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కార్యకర్తలకు సీఎంను కలిసే అవకాశం లేదన్నారు. పవన్‌తో చర్చించిన విషయం నిజమే.. కానీ జనసేన నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేదని కృష్ణమోహన్ ప్రకటించారు.

వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తానని ఆమంచి స్పష్టం చేశారు. 32 నెలల నుంచి రూ.6,500 కోట్లు వడ్డీ రాయితీని చెల్లించలేదన్నారు. వాటిలో రూ.2,200 కోట్లనే పసుపు-కుంకుమ కింద ఇచ్చారని ఆరోపించారు. చంద్రబాబుకు రెమిడీ జగన్‌నే అని అందుకే వైసీపీలో చేరినట్లు తెలిపారు.

తానొక్కడినే కాదని త్వరలో చాలా మంది ఎమ్మెల్యేలు టీడీపీని వీడేందుకు రెడీగా ఉన్నారని ఆమంచి కృష్ణమోహన్ బాంబు పేల్చారు. కేవలం అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయుడుకే ఓటేశారన్నారు.

హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా మరింతకాలం పొడిగించాల్సింది పోయి ఓటుకు నోటు కేసులో భయపడి పారిపోయి వచ్చారని చంద్రబాబుపై ఆమంచి విమర్శలు చేశారు. అల్జీమర్స్ వచ్చిందో లేదా పిచ్చింది పట్టిందో కానీ నిన్న, మొన్న చెప్పింది మరచిపోమంటారు, ఈ రోజు చెప్పిందే గుర్తు పెట్టుకుంటారని ఎద్దేవా చేశారు. 

ఆమంచి రాజీనామా ఎఫెక్ట్: కరణం బలరామ్‌కు బాబు ఆదేశం

ఫలించని చంద్రబాబు యత్నాలు...వైసీపీలోకి ఆమంచి కృష్ణమోహన్..?
 

click me!