ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ: రుణమాఫీ, అన్నదాత సుఖీభవకు గ్రీన్ సిగ్నల్

By Siva KodatiFirst Published Feb 13, 2019, 11:26 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఫిబ్రవరి చివరి వారంలో ‘‘అన్నదాత సుఖీభవ’’ పథకానికి సంబంధించి చెక్కులు పంపిణీకి నిర్ణయం తీసుకున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఫిబ్రవరి చివరి వారంలో ‘‘అన్నదాత సుఖీభవ’’ పథకానికి సంబంధించి చెక్కులు పంపిణీకి నిర్ణయం తీసుకున్నారు.  

ఖరీఫ్, రబీలో ఒక్కో సీజన్‌కు రైతులకు రూ. 5 వేలు సాయం చేయనున్నారు. కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనితో పాటు రైతు రుణమాఫీ చెల్లింపులు కూడా వెంటనే చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

జర్నలిస్టులకు కేటాయించిన 30 ఎకరాల స్థలానికి సంబంధించి విడతల వారీగా సీఆర్డీఏకు సొమ్ము చెల్లించేందుకు కేబినెట్ ఆమోదించింది. ఎన్టీవోలు, సచివాలయ ఉద్యోగులకు 175 చదరపు గజాల ఇంటిస్థలాన్ని, చదరపు గజం రూ.4 వేల చొప్పున 230 ఎకరాల కేటాయింపులకు సైతం ఆమోదించారు.

అలాగే రాజధాని అమరావతిని కలుపుతూ నూతనంగా నిర్మిస్తున్న వైకుంఠపురం బ్యారేజ్ నిర్మాణానికి నిర్ణయం తీసుకోవడంపై మంత్రివర్గం ముఖ్యమంత్రికి అభినందనలు తెలుపుతూ తీర్మానం చేసింది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ డీపీఆర్‌-2కు సీడబ్ల్యూసీ ఆమోదంపై చర్చించగా, రివైజ్డ్ డీపీఆర్ పూర్తిగా ఆమోదించేలా చూడాలని ముఖ్యమంత్రి అన్నారు. చింతలపూడి ఎత్తిపోతల నుంచి నీటిని అందించడంపైనా కేబినెట్ చర్చించింది.  డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు, సిమ్ కార్డ్‌తో పాటు మూడేళ్ల కనెక్టివిటీ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. 

click me!