ఈ సారి పోలీసుల మీద దాడిచేసిన చింతమనేని

First Published May 8, 2017, 12:35 PM IST
Highlights

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు తెలుగుదేశం  ఎమ్మెల్యే  ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ మళ్లీ నోరు పారేసు కున్నాడు. దేవరపల్లి పోలీస్టేషన్‌ అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్  పాపారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన మీద  323, 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు తెలుగుదేశం  ఎమ్మెల్యే  ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ మళ్లీ నోరు పారేసు కున్నాడు.

 

ఆయన  మీద దెందులూరు పోలీస్టేషేన్‌లో కేసు నమోదయింది.

 

 దేవరపల్లి పోలీస్టేషన్‌ ఏఎస్సై జె.పాపారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 323, 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఎస్ ఐ  కిషోర్‌బాబు మీడియాకు తెలిపారు.

 

విషయమేమిటంటే, దేవరపల్లిలో అమ్మవారి జాతర జరుగుతున్నందున ప్రజలకు అసౌర్యం లేకుండా ఉండేందుకు వాహనాల రాకపోకలను నియంత్రించే పనిలో  పోలీసులు ఉన్నారు. వారు దెందులూరు మండలం సింగవరం కూడలి వద్ద  జాతీయ రహదారిపై  భారీ వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు.

 

అపుడు డ్యూటిలో ఎ ఎస్ ఐ తో పాటు మరో ఇద్దరు పోలీసులు, ఇద్దరు సీపీవోలు విధుల్లో ఉన్నారు.

 

ఆదివారం రాత్రి వాహనాలు దారి మళ్లిస్తున్నపుడు చింతమనేని  అక్కడి వచ్చారు. తనేమిటో పోలీసులకు చూపించారు.

 

తన వాహనానికి అగిపోయిందని ఆయన అగ్రహోదగ్రుడయ్యాడు. దుర్భాషలాడుతూ సీపీవోలపై దాడి చేశారు.

 

వారు ఈ సంఘటనలమీద తమ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే మీద కేసు నమోదు చేశామని కిశోర్ బాబు తెలిపారు.

 

అమధ్య వనజాక్షి అనే ఎమ్మార్వో తో గొడవ పడి నానా  ఆయన నానా రభస చేశారు. దీనిమీద అసెంబ్లీ కూడ స్తంభిచించింది.అయితే, అపుడు మంచి సంబంధాలున్నందున తానే స్వయంగా జోక్యం చేసుకుని ఇద్దరరిని సుతి మొత్తగా మందలించి  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  గొడవ ముదరకుండా  చూశారు. ఇపుడు మంత్రి పదవి రాకపోవడం, ముఖ్యమంత్రిమీద చింతమనేని అలిగి, గొడవ చేసి చికాకు కల్గించాడు.  ఈ నేపథ్యం సింగవరం గొడవ జరిగింది. ముఖ్యమంత్రి అమెరికాలో ఉన్నారు.ఏమవుతుందో చూడాలి.ఈ సారి కొంత ఏడిపించి గాని, ముఖ్యమంత్రి వదలడని పార్టీ వాళ్లే అంటున్నారు.

click me!