పవన్.. నేను మాట్లాడితే మూడు రోజులు అన్నం తినవు: చింతమనేని

sivanagaprasad kodati |  
Published : Sep 27, 2018, 01:26 PM IST
పవన్.. నేను మాట్లాడితే మూడు రోజులు అన్నం తినవు: చింతమనేని

సారాంశం

పవన్ తనపై వ్యక్తిగత విమర్శలు చేసినా తాను తాట్టుకున్నానని.. అదే నేను వ్యక్తిగత విమర్శల జోలికి వెలితే పవన్ కల్యాణ్ మూడు రోజులు అన్నం తినరన్నారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

పవన్ తనపై వ్యక్తిగత విమర్శలు చేసినా తాను తాట్టుకున్నానని.. అదే నేను వ్యక్తిగత విమర్శల జోలికి వెలితే పవన్ కల్యాణ్ మూడు రోజులు అన్నం తినరన్నారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.

ఒక నటుడిగా పవన్ అంటే తనకు ఎంతో ఇష్టమని.. కానీ తనపై వ్యక్తిగత విమర్శలు చేసి పవన్ తన స్థాయిని దిగజార్చుకున్నారన్నారు. నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు లాంటి వారితో హెలికాఫ్టర్‌లో తిరిగిన స్థాయి నీదని.. ఒక చిన్ని నియోజకవర్గానికి ఎమ్మెల్యేనైన నన్ను గురిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని పవన్‌ను చింతమేనేని ప్రశ్నించారు.

ప్రపంచాన్ని జయించాలనుకున్న హిట్లర్‌తో నన్ను పోల్చీ నా స్థాయిని పెంచావని.. అందుకు పవన్‌కు ధన్యవాదాలని అన్నారు. రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ని బతికిస్తానన్న నరేంద్రమోడీని ఏం ప్రశ్నించకుండా.. ప్రత్యేకహోదాను పవన్ పక్కన పెట్టారని.. పాచీపోయిన లడ్డూలు ఇచ్చారన్న నువ్వు.. అందులో నీకు ఏ లడ్డూ వచ్చిందని చింతమనేని ప్రశ్నించారు. 

పులివెందులలో జగన్‌పై మాట్లాడగలవా..? పవన్‌కు... చింతమనేని సవాల్

సైగ చేస్తే తన్ని తగలేస్తారు: చింతమనేనికి పవన్ హెచ్చరిక

ఎమ్మెల్యే చింతమనేనిపై పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

పవన్... ఎస్.. నేను అసెంబ్లీ రౌడీనే: చింతమనేని ప్రభాకర్
 

PREV
click me!

Recommended Stories

Kadapa Steel Plant: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మ‌రో ముంద‌డుగు.. 3,500 ఎకరాల్లో రూ.16,350 కోట్ల పెట్టుబడి
Nara Lokesh Emotional: చిన్నప్పుడే నాన్న చనిపోయారు..ఈ విద్యార్థిని కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు