చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం  

By Rajesh KarampooriFirst Published Mar 30, 2024, 10:46 AM IST
Highlights

Chevireddy Bhaskar Reddy Biography: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. నాడు వైయస్సార్, నేడు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన నాయకుడు. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత గ్రామం ఉన్న చంద్రగిరిలో రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఘనత ఆయన సొంతం. అయితే.. ప్రస్తుతం ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ నుంచి కాకుండా.. వైసిపి తరఫున ఒంగోలు ఎంపీగా బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో మాస్ లీడర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి రియల్ స్టోరీ మీ కోసం..

Chevireddy Bhaskar Reddy Biography: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. నాడు వైయస్సార్, నేడు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన నాయకుడు. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత గ్రామం ఉన్న చంద్రగిరిలో రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఘనత ఆయన సొంతం. అయితే.. ప్రస్తుతం ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ నుంచి కాకుండా.. వైసిపి తరఫున ఒంగోలు ఎంపీగా బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో మాస్ లీడర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి రియల్ స్టోరీ మీ కోసం 

విద్యాభ్యాసం

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతి మండలం, తుమ్మలగుంటలో జూన్ 4, 1973 జన్మించారు. ఆయన తండ్రి సుబ్రహ్మణ్యం రెడ్డి. భాస్కర్ రెడ్డి ప్రాథమిక విద్య అంతా ఆ మండలంలోని పూర్తి చేశారు. ఆ తరువాత వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ, బీఎల్, పీహెచ్‌డీ పూర్తి చేశాడు. ఇక చెవిరెడ్డి కుటుంబం విషయానికి వస్తే..ఆయన లక్ష్మీ గారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం.

రాజకీయ జీవితం  

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విద్యార్థి దశ నుంచి విద్యార్థుల సమస్యలపై స్పందించి పోరాటం చేసేవారు. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదివే సమయంలో ఆయన పలు స్టూడెంట్ యూనియన్లకు లీడర్ గా ఉన్నారు. ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించేవారు అంతేకాదు కాంగ్రెస్ అనుబంధ విద్యార్ధి సంఘమైన ఎన్ఎస్ యూఐలో పనిచేసిన ఆయన రాష్ట్ర నాయకుడిగా గుర్తింపు పొందారు. 

కాంగ్రెస్ పార్టీలో చేరిక 

ఆ తరువాత వైఎస్ఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేశారు. పార్టీలో యాక్టివ్ గా పని చేస్తూ అధిష్టానం ద్రుష్టిని ఆకర్షించారు. ఆయనకు వైయస్సార్ అంటే ఎంతో అభిమానం. వైయస్సార్ ముఖ్యమంత్రి కాకముందు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆయనతో మంచి అనుబంధం ఉండేది. సీఎం అయిన తర్వాత ఆయనను రాజకీయంగా మరింత ప్రోత్సహించారు. ఇలా వైఎస్ఆర్ ప్రోత్సహంతో జడ్పిటిసిగా గెలుపొందారు. ఈ తరుణంలో భాస్కర్ రెడ్డికి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా) చైర్మన్ గా అవకాశం కల్పించారు. 

వైసీపీలోకి చేరిక

ఇక వైఎస్సార్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైయస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచారు. ఆయన వెన్నంటి ముందుకు సాగారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గ నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆయనకు జగన్ టికెట్ ఇచ్చారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో గల్లా అరుణ్ కుమారి (టిడిపి)నుంచి గెలుస్తుందని భావించారు. కానీ,  45 వేల ఓట్ల మెజారిటీతో భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇలా చెవిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే..ఈ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా ఆయన ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు. 

ఇక 2019 ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మరోసారి జగన్ టికెట్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లోనూ చెవిరెడ్డి భారీ మెజారిటీతో గెలిచారు. సుమారు 41 వేల ఓట్ల మెజారిటీతో రెండోసారి ఆయన విజయాన్ని సాధించారు. అదే సమయంలో ఏపీలో మొదటి వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రభుత్వ విప్ గా జగన్ నియమించారు.

ఆ తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా 2019లో బాధ్యతలు చేపట్టారు. అలాగే.. 2021లో టిటిడి పాలకమండలి సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. ఆయన నియోజకవర్గంలో చేపట్టే సేవా కార్యక్రమాల గురించి రాష్ట్రవ్యాప్తంగా చర్చించుకుంటారు. ఇక 2024 ఎన్నికల్లో ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండగా..ఇక ఆయన వైసిపి తరఫున ఒంగోలు ఎంపీగా బరిలో నిలిచారు.  
 

click me!