కృష్ణరాఘవ జయేంద్రభరత్‌: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం  

By Rajesh KarampooriFirst Published Mar 30, 2024, 2:13 AM IST
Highlights

Krishna Raghava Jayendra Bharath Biography: కుప్పం.. తెలుగు దేశం పార్టీకి కంచు కోట. అలాగే.. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజకీయ అడ్డా. ఈ నియోజకవర్గంలో1989 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు వరుసగా 7 సార్లు విజయం సాధిస్తున్నారు. అయితే  వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు వైసీపీ కృష్ణరాఘవ జయేంద్రభరత్‌(Krishna Raghava Jayendra Bharath) అనే యువనాయకుడ్ని బరిలో దించింది. ఈ నేపధ్యంలో కేఆర్జే భరత్ వ్యక్తిగత, రాజకీయ విశేషాలు మీకోసం..

 బాల్యం, విద్యాభ్యాసం,కుటుంబ నేపథ్యం 

కృష్ణరాఘవ జయేంద్రభరత్‌( కేఆర్జే భరత్)1988, నవంబరు 13న ఏపీలోని చిత్తూరు జిల్లా లో చంద్రమౌళి, పద్మజ దంపతులకు జన్మించాడు. ఆయన బీటెక్‌ వరకు చదువుకున్నాడు. భరత్‌ తండ్రి చంద్రమౌళి మాజీ ఐఏఎస్‌ అధికారి. ప్రజాసేవ చేయాలనే ఆసక్తితో రాజకీయాల్లోకి వచ్చారు. ఈ తరుణంలో  2014, 2019 ఎన్నికల్లో కుప్పం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రమౌళి.. వరుసగా 55 వేలు, 70 వేల ఓట్లు సాధించి, టీడీపీ అధినేత చంద్రబాబు చేతిలో ఓటమి పాలయ్యారు. కాగా.. అనారోగ్యంతో 2020 ఏప్రిల్ 17న చంద్రమౌళి మరణించాడు. చంద్రమౌళి బతికున్నంత కాలంలో వైసీపీ కుప్పం అసెంబ్లీ ఇంచార్జీగా కొనసాగారు. 

రాజకీయ ప్రవేశం

తండ్రి చంద్రమౌళి ఆకస్మిక మరణాంతరం భరత్ రాజకీయాల్లోకి వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2019లో వైఎస్సార్‌సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితుడై నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశాడు. దీంతో జయేంద్ర భరత్‌ ను చిత్తూరు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా  2021లో వైయ‌స్ జగన్ ప్రకటించారు. ఆయన 18 నవంబర్ 2021నన నామినేషన్ దాఖలు చేయగా..  3 డిసెంబర్ 2021న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు భరత్. శాసనమండలి సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశాడు. 

ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి  భరత్ మరింత దూకుడును పెంచాడు. భరత్ ప్రయత్నాలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తోడ్పాటును అందించారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో టీడీపీ అసంతృప్తనేతలను తమ వైపునకు తిప్పుకున్నారు. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో వైసీపీ జయకేతనం ఎగురవేసేలా చేశారు. కుప్పం మున్సిపాలిటీని కూడా వైసీపీ గెలుచుకుంది. కుప్పం మున్సిపాలిటీలో విజయం సాధించిన తర్వాత వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది.తన తండ్రి చంద్రమౌళి చంద్రబాబుపై విజయం సాధించలేకపోయినా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుపై తాను విజయం సాధిస్తానని భరత్  ధీమాతో ఉన్నారు. 
 
click me!