బొత్స ఝాన్సీ లక్ష్మి: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం  

By Rajesh KarampooriFirst Published Mar 30, 2024, 12:32 AM IST
Highlights

Botsa Jhansi Lakshmi Biography: 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మి  విజయనగరం లోక్ సభ నియోజిక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె వ్యక్తిగత, రాజకీయ నేపథ్యంపై ప్రత్యేక కథనం 
 

Botsa Jhansi Lakshmi Biography: 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మి  విజయనగరం లోక్ సభ నియోజిక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె వ్యక్తిగత, రాజకీయ నేపథ్యంపై ప్రత్యేక కథనం 
 
బాల్యం, వ్యక్తిగత జీవితం 

బొత్స సత్యనారాయణ సతీమణినే బొత్స ఝాన్సీ లక్ష్మి. ఆమె 1964, ఏప్రిల్ 11 న రాజమండ్రిలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు శ్రీమతి మజ్జి కళావతి- రామారావు. ఆమె చదువుల్లో ప్రతిభవంతురాలు. ఉన్నత విద్యను అభ్యసించాలని భావించినా ఆమెకు పెళ్లి చేయాలని భావించారు. ఇలా బొత్స సత్యనారాయణ- ఝాన్సీ లక్ష్మి గార్ల వివాహం 1985 మార్చి 16న జరిగింది. వీరికి ఒక కుమార్తె అనూష, ఒక కుమారుడు సందీప్. వీరిద్దరు ఎంబిబిఎస్ పూర్తి చేశారు. కుమారుడు డాక్టర్ గా కూడా సేవలందిస్తున్నారు.
 విద్యాభ్యాసం

బొత్స ఝాన్సీ లక్ష్మి వివాహమైన తర్వాత భర్త సహకారంతో ఆమె ఉన్నత చదువులు చదువుకున్నారు.  ఆమె ఎంఏ ఫిలాసఫీ చేశారు. ఎల్‌ఎల్‌బీ, న్యాయ విద్యలో రెండు పీహెచ్‌డీలు పూర్తి చేశారు. న్యాయ శాస్త్రంలో పంచాయతీరాజ్ ద్వారా మహిళా సాధికారత, సామాజిక న్యాయ శాస్త్రం అనే అంశంపై ఆమె  పీహెచ్డీ కూడా చేస్తారు. అలాగే.. న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ సభ్యత్వం కూడా అందుకున్నారు. కొత్తకాలం న్యాయవాదిగా ప్రాక్టిస్ కూడా  చేశారు. అయితే.. తన భర్త బొత్స సత్యనారాయణ రాజకీయంగా బిజీ కావడంతో కుటుంబ బాధ్యతలన్నీ ఝాన్సీ గారే చూసుకునేవారు.  బొత్స సత్యనారాయణ రాజకీయ ఎదుగుదలలో ఆమె ఎంతో సహాయం చేశారనే చెప్పాలి. 

రాజకీయ ప్రవేశం 

భర్త బొత్స సత్యనారాయణ సహాకారంతో బొత్స ఝాన్సీ లక్ష్మి రాజకీయాల్లోకి ఏంట్రీ ఇచ్చారు. ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2001లో ప్రదేష్ కాంగ్రెస్ కమిటీ సభ్యురాలుగా  పని చేసిన ఆమె జడ్పీటీసీగా గెలుపొందారు. దీంతో 2001-2006 వరకు విజయనగరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ప్రాతినిధ్యం వహించారు. ఈ సమయంలో (2002-2003) ఉత్తమ మహిళా అవార్డును కూడా అందుకున్నారు. ఇక 2007లో బొబ్బిలి పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఝాన్సీ పోటీ చేసి గెలిచారు. తర్వాత 2009 ఎన్నికల్లో విజయనగరం ఎంపీగా పోటీ చేసి ఝాన్సీ గారు  కాంగ్రెస్ పార్టీ తరఫున రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ సమయంలో ఉత్తమ పార్లమెంటీరియల్ గా కూడా గుర్తింపు పొందారు. కానీ, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయనగరం ఎంపీగా పోటీ చేసి ఆమె తొలిసారి ఓటమి పాలయ్యారు. 
 
 మరోవైపు.. రాష్ట్ర విభజన తర్వాత బొత్స సత్యనారాయణ కొంతకాలం రాజకీయంగా స్తబ్దంగా ఉండిపోయారు. చివరకు 2017న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలవడం,  వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక 2024 ఎన్నికల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ  భార్య డాక్టర్ ఝాన్సీని సీఎం జగన్ ఖరారు చేశారు. బొత్స ఝాన్సీ గారు ఉన్నత విద్యావంతురాలు కావడంతో పాటు ఉత్తరాంధ్ర కాపు సామాజిక వర్గం కావడం సానుకూల అంశంగా వైసీపీ భావిస్తోంది. అలాగే సుధీర్ఘరాజకీయ అనుభవం ఉండటంతో బొత్స ఝాన్సీ ని ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ విశాఖ ఎంపీ టికెట్ ను  భరత్ కేటాయించారు. ఆయన నందమూరి బాలయ్య చిన్నల్లుడు. గీతం భరత్ గీతం విద్యాసంస్థల అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. వీరి మధ్య పోటీ హోరాహోరీగా సాగబోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

పదవులు

>> 2005- ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యురాలు
>> 2010- ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, 
>> 2010- MGNREGA సబ్-కమిటీ, వర్కింగ్ గ్రూప్ ఛైర్ పర్సన్ , 
>> 2010- ఇండియా-అజర్‌బైజాన్ పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్  ఛైర్ పర్సన్ 
>> 2010  కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు

అవార్డులు 

>> ఆమె విశాఖ సమాచారమ్ అనే జర్నల్ నుండి 2002-2003 ఉత్తమ మహిళా అవార్డును అందుకుంది. 

click me!