ఆ ముగ్గురు టీడీపీని ఓడించే కుట్ర: బాబు సంచలనం

Published : Jan 03, 2019, 04:53 PM IST
ఆ ముగ్గురు టీడీపీని ఓడించే కుట్ర: బాబు సంచలనం

సారాంశం

 తెలంగాణలో ఓడిపోయినట్టుగానే ఏపీలో కూడ టీడీపీ ఓడిపోనుందని మోడీ చెప్పడం  భవిష్యత్తులో చేసే కుట్రకు నాందిగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. 

గుంటూరు: తెలంగాణలో ఓడిపోయినట్టుగానే ఏపీలో కూడ టీడీపీ ఓడిపోనుందని మోడీ చెప్పడం  భవిష్యత్తులో చేసే కుట్రకు నాందిగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఆ ముగ్గురు నేతలు ఏపీలో టీడీపీని ఓడించే కుట్ర చేస్తోందని బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

గురువారం నాడు గుంటూరులో జరిగిన జన్మభూమి సభలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.తెలంగాణలో వచ్చిన ఫలితాలే ఏపీలో కూడ పునరావృతమయ్యే అవకాశం ఉందని మోడీ చెప్పడాన్ని బాబు తప్పుబట్టారు. కేసీఆర్, మోడీ, వైఎస్ జగన్‌లు కుట్రకు పాల్పడుతున్నారని చంద్రబాబునాయుడు ఆరోపించారు.

ఈ ముగ్గురు మోడీలు కలిసి ఏపీలో టీడీపీని ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కుట్రలను సాగనిస్తామా అని బాబు ప్రశ్నించారు.కేంద్రం రాష్ట్రాన్ని మోసం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. మోడీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని  ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

తెలంగాణలో టీడీపీ ఓటమి పాలైంది... అయితే బీజేపీ ఎన్ని సీట్లు గెలిచారో చెప్పాలని మోడీనీ బాబు ప్రశ్నించారు. రెండు సార్లు మోడీ , ఏడు దఫాలు అమిత్ షా, కేంద్ర మంత్రులు, ముగ్గురు సీఎంలు  ప్రచారం నిర్వహించినా కూడ తెలంగాణలో ఒక్క సీటును మాత్రమే గెలిచారని బాబు ఎద్దేవా చేశారు.

వైసీపీకి ఓటేస్తే మోడీకి, కేసీఆర్‌కు ఆ సీట్లను గంపగుత్తగా  అమ్ముకొంటారని  బాబు ఆరోపించారు. తెలంగాణకు ఆదాయంలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ అభివృద్ధిలో వెనుకంజలో ఉందన్నారు. 2020 నాటికి ఏపీని దేశంలో అగ్రస్థానంలో నిలుపుతామని బాబు చెప్పారు.జగన్ నెత్తిపై సీబీఐ కేసులు ఉన్నాయని  బాబు ఎద్దేవా చేశారు. ఈ కేసుల నుండి  బయట పడేందుకు కేసీఆర్, మోడీతో జగన్ చేతులు కలిపారని బాబు ఆరోపించారు.

టీడీపీ హాయంలో ఏపీ ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన చెప్పారు. మోడీ పాలనలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

సంబంధిత వార్తలు

బాబు, పవన్ పొత్తు: శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు

జగన్‌కు చెక్: పవన్ తో దోస్తీకి బాబు ప్లాన్?

పవన్‌తో కలిసి పోటీ చేస్తే జగన్‌కు ఏం ఇబ్బంది: బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

మోడీకి బాబు కౌంటర్: తెలంగాణలో బీజేపీ ఓడిపోతే మోడీకి ఎందుకు సంతోషం

బాబు ఓడిపోయాడు, కేసీఆర్ కూటమి తెలియదు: మోడీ సెటైర్లు

అప్పుడే రామ మందిరం, తెలంగాణలో గెలుస్తామని చెప్పలేదు: మోడీ

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu