
కర్నూలు: హీరో శివాజీపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి నిప్పులు చెరిగారు. శివాజీ తెలుగుదేశం పార్టీ రాజకీయ దళారి అని ఆరోపించారు. టీడీపీ ముసుగు ధరించిన పొలిటికల్ బ్రోకర్ అంటూ ఘాటుగా విమర్శించారు. కర్నూల్ లో గురువారం మీడియాతో మాట్లాడిన విష్ణువర్థన్ రెడ్డి శివాజీపై మండిపడ్డారు.
ఆపరేషన్ గరుడ పేరుతో నానా హంగామా చేస్తున్నాడని అదంతా టీడీపీ ఆడిస్తున్న డ్రామా అంటూ కొట్టిపారేశారు. శివాజీ చెప్తున్నది ఆపరేషన్ గరుడ కాదని ఆపరేషన్ వడ అయి ఉంటుందంటూ సెటైర్లు వేశారు.
శివాజీ తెలుగుదేశం పార్టీ మనిషి అంటూ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు చెప్తే మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చెయ్యడం ఆ తర్వాత మళ్లీ కనిపించకపోవడం జరుగుతుందని ఇదంతా ఓ షో అంటూ వ్యాఖ్యానించారు బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి.
ఈ వార్తలు కూడా చదవండి
బీజేపీతో పొత్తుకు టీడీపీ ప్లాన్, వీడియోలున్నాయంటున్న బీజేపీ నేత