తిరుపతిలో వైసీపీ ఒక తట్టమట్టి అయినా వేసిందా: చంద్రబాబు

By narsimha lode  |  First Published Apr 12, 2021, 9:37 PM IST

టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరపున తిరుపతి గాంధీరోడ్డులో  సోమవారం నాడు చంద్రబాబు బహిరంగ సభ నిర్వహించారు



తిరుపతి: టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరపున తిరుపతి గాంధీరోడ్డులో  సోమవారం నాడు చంద్రబాబు బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ ఇది రాష్ట్రాన్ని కాపాడుకునే ఎన్నికలు. అందుకు మీ చేతిలో ఉన్న ఓటు వజ్రాయుధాన్ని వినియోగించాలని కోరారు.

also read:ఓటమి భయంతోనే డ్రామా:చంద్రబాబు సభపై రాళ్ల దాడిపై మంత్రి పెద్దిరెడ్డి

Latest Videos

undefined

తిరుపతిలో ఎన్టీఆర్ మహిళా యూనివర్సిటీ, స్విమ్స్ ఆసుపత్రి, బర్డ్ ఆసుపత్రి, ఐసెర్, ఐఐఐటీ, తెలుగుగంగ, జూ పార్క్, అరవింద్ కంటి ఆసుపత్రి, టాటా కాన్సర్ ఆసుపత్రి , గరుడ వారధి, అంతర్జాతీయ విమానాశ్రయం, చాలా కంపెనీలు ఇలా అన్ని టీడీపీ ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు.  వైసీపీ ఒక తట్టమట్టి అయినా వేసిందా?. అని ప్రశ్నించారు.

తిరుపతి నియోజకవర్గం‌లో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. తిరుపతి ఉపఎన్నిక నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరపున ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీ జయదేవ్, నల్లారి కిషోర్, పలువురు టీడీపీ సీనియర్ నేతలు రోడ్‌పై నడుస్తూ ప్రజలకు అభివాదం చేస్తున్నారు. టీడీపీకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.  ఈ నెల 17న ఉపఎన్నిక జరగనుంది. టీడీపీ నుంచి పనబాక, వైసీపీ నుంచి గురుమూర్తి, బీజేపీ నుంచి రత్నప్రభతో పాటు పలు పార్టీల అభ్యర్థులు కూడా పోటీ ఉన్నారు.

click me!