ఓటమి భయంతోనే డ్రామా:చంద్రబాబు సభపై రాళ్ల దాడిపై మంత్రి పెద్దిరెడ్డి

Published : Apr 12, 2021, 09:21 PM IST
ఓటమి భయంతోనే డ్రామా:చంద్రబాబు సభపై రాళ్ల దాడిపై మంత్రి పెద్దిరెడ్డి

సారాంశం

ఉద్దేశ్యపూర్వకంగానే చంద్రబాబునాయుడు నాటకాలు ఆడుతున్నారని ఏపీరాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు ప్రచార సభలో రాళ్లు విసిరిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

తిరుపతి: ఉద్దేశ్యపూర్వకంగానే చంద్రబాబునాయుడు నాటకాలు ఆడుతున్నారని ఏపీరాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు.
చంద్రబాబు ప్రచార సభలో రాళ్లు విసిరిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

also read:తిరుపతిలో చంద్రబాబు ప్రచారసభలో రాళ్లు విసిరిన దుండగులు: రోడ్డుపై బైఠాయింపు

తిరుపతిలో సోమవారం నాడు రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి ఎంపీ స్థానంలో ఓడిపోతామని తెలిసిపోవడంతో రాళ్లు రువ్వారని చంద్రబాబునాయుడు నాటకాలు ఆడుతున్నాడని ఆయన ఆరోపించారు.రాళ్లు విసిరిన వాళ్లు ఎవరో పోలీసులు తేలుస్తారని ఆయన చెప్పారు. ఈ ఘటనపై వాస్తవాలను నిగ్గు తేల్చాలని ఆయన పోలీసులను కోరారు. రాళ్ల దెబ్బతగిలిన వారు ఎవరు చెప్పడం లేదన్నారు.  రాళ్లు వేయాల్సిన అవసరం ఎవరికి ఉందని ఆయన ప్రశ్నించారు.ఈ విషయమై పోలీసులు వాస్తవాలను వెలికితీయాలని ఆయన పోలీసు ఉన్నతాధికారులను కోరారు.

PREV
click me!

Recommended Stories

బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?