
నంద్యాల ఉపఎన్నికలో గెలుపుపై చంద్రబాబులో అనుమానాలు మొదలైందా? ఏకగ్రీవం కోసం ప్రయత్నిస్తున్నారా? అందుకు జగన్ అంగీకరిస్తారా? నంద్యాలలో చంద్రబాబు పర్యటన తర్వాత అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. బుధవారం రాత్రి ఇఫ్తార్ విందు తర్వాత ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్ధి గెలుపుపై పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. నేతల నుండి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకున్నారు.
మళ్ళీ గురువారం ఉదయం రెండోసారి నేతలతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, భూమా బ్రహ్మానందరెడ్డి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నిద్దామని చెప్పారు. దాంతో నేతలందరూ బిత్తరపోయారు. చంద్రబాబు రాత్రి మాట్లాడిన మాటలకు ఉదయం మాటలకు ఏమాత్రం సంబంధం లేదు. రాత్రేమో ఉపఎన్నికలో గెలుపు వ్యూహాలపై మాట్లాడిన చంద్రబాబు ఉదయమయ్యేసరికి ఏకగ్రీవం కోసం ప్రయత్నిద్దామని చెప్పటంతో ఆశ్చర్యపోయారు.
దాంతో చంద్రబాబు వైఖరిపై పార్టీ నేతల్లో మొదలైంది. ఉపఎన్నికలో చంద్రబాబు చేయించుకున్న సర్వే రిపోర్టులే కారణంగా అనుమానిస్తున్నారు. ఉప ఎన్నికలో పార్టీ గెలుపు అవకాశాలపై చంద్రబాబు సర్వేలు చేయించుకున్నారు. అయితే, ఏ సర్వేలొ కూడా టిడిపి గెలుస్తుందని స్పష్టంగా రాలేదట. దాంతో గెలుపుపై చంద్రబాబులో అనుమానాలు మొదలయ్యాయట.
అసలు మొదటి నుండి టిడిపి గెలుపుపై మంత్రి భూమా అఖిలప్రియలో కూడా నమ్మకం ఉన్నట్లు లేదు. అందుకనే తమ అభ్యర్ధిని ఏకగ్రీవం చేసుకునేదుకు వ్యక్తిగత స్ధాయిలో వైసీపీ నేతలతో రాయబారాలు నడిపారు. అయితే ఫలించలేదు. ఆ విషయం చంద్రబాబుకు కూాాడా తెలుసు. అదే విషయమై చంద్రబాబు ఈరోజు ఉదయం అఖిల, బ్రహ్మానందరెడ్డితో మాట్లాడారు. టిడిపి అభ్యర్ధి గెలుపుకోసం ముందు ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నిద్దామని, కుదరకపోతే అప్పుడు ఎన్నిక గురించి ఆలోచిద్దామని చెప్పారు.
అదే విషయమై అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతుూ, చంద్రబాబు విజయవాడ వెళ్ళిన తర్వాత ఏకగ్రీవం కోసం అవసరమైన కసరత్తు చేస్తారని చెప్పారు. వైసీపీలో ఎవరితో మాట్లాడాలి? భూమా కుటుంబం తరపున మాట్లాడాలా? లేక పార్టీ తరపున మాట్లాడాలా? అన్న విషయం చంద్రబాబు నిర్ణయిస్తారని అఖిల చెప్పారు. అంటే, శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరటం, ఆయనే అభ్యర్ధని ప్రచారం జరుగటం చంద్రబాబుపై బాగానే ప్రభావం చూపిందనే అనుకోవాలి. టిడిపి-వైసీపీ లు ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో ఏకగ్రీవం కోసం చంద్రబాబే ఆలోచిస్తున్నారంటే దేనికి సంకేతాలు