ఫోన్ లాక్కున్న పోలీసులు... నేలపై బైఠాయించి చంద్రబాబు నిరసన

By Arun Kumar PFirst Published Mar 1, 2021, 11:35 AM IST
Highlights

చంద్రబాబుతో పాటు ఆయన పీఏ, వైద్య అధికారి ఇతరుల ఫోన్లను  పోలీసులు బలవంతంగా లాక్కున్నట్లు తెలుస్తోంది.  

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆయన తిరుపతిలో తలపెట్టిన దీక్షకు కూడా అనుమతి లేదని తేల్చి చెప్పారు. అయినప్పటికి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబు విమానాశ్రయంలో నేలపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.  ఈ క్రమంలోనే చంద్రబాబుతో పాటు ఆయన పీఏ, వైద్య అధికారి ఇతరుల ఫోన్లను  పోలీసులు బలవంతంగా లాక్కున్నట్లు తెలుస్తోంది.

వీడియో  నిబంధనలు అతిక్రమిస్తే అదుపులోకి... చంద్రబాబుకు పోలీస్ నోటీసులు

చిత్తూరు కలెక్టర్, ఎస్పీలకు తన పర్యటన అడ్డుకున్న తీరుపై వినతిపత్రం ఇచ్చి తిరిగి వెళ్తానని చంద్రబాబు పోలీసులకు తెలిపారు. అయినప్పటికి అధికారులను కలిసేందుకు అనుమతి నిరాకరించిన పోలీసులు. దీంతో పోలీసులతో చంద్రబాబు వాదనకు దిగడంతో పాటు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి ఇచ్చే వరకు విమానాశ్రయంలోనే తన నిరసన కొనసాగుతుందని చంద్రబాబు తేల్చి చెప్పారు. ప్రతిపక్షనేతగా కలెక్టర్, ఎస్పీలను కలిసే హక్కు లేదా అని పోలీసులను నిలదీశారు. ఇలా చంద్రబాబు అరగంట నుంచి విమానాశ్రయంలోనే ఉన్నారు. 

read more   చిత్తూరు జిల్లా టిడిపి నాయకుల హౌస్ అరెస్టులు... అచ్చెన్నాయుడు సీరియస్

 ఇక ఇప్పటికే చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన రేణిగుంట పోలీసులు... నిబంధనలు అతిక్రమిస్తే అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి ఎన్నికల సంఘం వద్ద అనుమతి తీసుకున్నట్లు తమకు తెలియదని నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. చంద్రబాబు తలపెట్టిన పర్యటన ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగేలా ఉందని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. 
 
 
 

 

click me!