విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆమరణ నిరహార దీక్షకు చంద్రబాబు సంఘీభావం తెలపనున్నారు. ఈ మేరకు చంద్రబాబునాయుడు మంగళవారం నాడు విశాఖపట్టణానికి వెళ్లనున్నారు.
విశాఖపట్టణం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆమరణ నిరహార దీక్షకు చంద్రబాబు సంఘీభావం తెలపనున్నారు. ఈ మేరకు చంద్రబాబునాయుడు మంగళవారం నాడు విశాఖపట్టణానికి వెళ్లనున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈ నెల 10వ తేదీన ఆమరణ దీక్షకు పల్లా శ్రీనివాసరావు దిగాడు. శ్రీనివాసరావు ఆరోగ్యం క్షీణించిందని టీడీపీ నేతలు ఆందోళనగా ఉన్నారు.పల్లా శ్రీనివాసరావు దీక్షకు ఈ నెల 14వ తేదీన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంఘీభావం తెలిపారు. మంగళవారం నాడు చంద్రబాబునాయుడు మద్దతు తెలపనున్నారు.
undefined
విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి.. విశాఖ స్టీల్ ప్లాంంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని రాష్ట్రంలోని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని టీడీపీ భావిస్తోంది. ఈ ఉద్యమంలో ఇతర పార్టీలను కూడ కలుపుకొనిపోవాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ విషయమై చంద్రబాబు విశాఖలో ఏం మాట్లాడుతారనేది ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది.