దొంగ దెబ్బ తీసేందుకే కన్నా కేసు:చంద్రబాబు

Published : Jan 30, 2019, 06:06 PM IST
దొంగ దెబ్బ తీసేందుకే కన్నా కేసు:చంద్రబాబు

సారాంశం

నన్ను దొంగ దెబ్బతీసేందుకే  ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కేసు వేయించారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.


అమరావతి: నన్ను దొంగ దెబ్బతీసేందుకే  ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కేసు వేయించారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వేసిన కేసుపై  బుధవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు.  తమపై దొడ్డిదారిలో దాడి చేస్తున్నారని  చంద్రబాబునాయుడు విమర్శించారు. ఈ కారణంగానే రాష్ట్రంలోకి సీబీఐకు అనుమతి ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు.

సీబీఐని అనుమతివ్వని కారణంగా  ఈడీని ప్రయోగించి తప్పుడు కేసులు పెట్టేందుకు సిద్దమయ్యారని ఆయన ఆరోపించారు.ఎవరైనా  అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పే అవకాశం లేకుండా కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. 
 

PREV
click me!

Recommended Stories

Tirupati: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుప‌తి ప‌రిస‌ర ప్రాంతాల సంద‌ర్శ‌న‌కు ప్ర‌త్యేక ప్యాకేజీలు
Vegetables Price : దిగజారిన టమాటా, స్థిరంగా ఉల్లి... ఈ వీకెండ్ కూరగాయల రేట్లు ఇవే