నదుల అనుసంధానంతో నీటి కొరత అధిగమిస్తాం: బాబు

First Published Jun 28, 2018, 3:01 PM IST
Highlights

ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు


శ్రీకాకుళం: నదుల నుసంధానంతో రైతాంగానికి నీటి కొరత లేకుండా చేస్తున్నట్టుగా  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  చెప్పారు.  రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. ఉపాధి హమీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాలని  కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టుగా ఆయన గుర్తు చేశారు. 

శ్రీకాకుళం జిల్లాలో గురువారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పంచెకట్టి ఎడ్లబండిపై  చంద్రబాబునాయుడు వ్యవసాయ క్షేత్రానికి వచ్చారు. అత్యాధునిక పనిముట్లతో సీఎం చంద్రబాబునాయుడు వరినాట్లను వేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.  రైతులు క్షేమంగా, ఆనందంగా ఉండాలనే లక్ష్యంతోనే తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన చెప్పారు. నదుల అనుసంధానం చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నదులను అనుసంధానం చేయడం ద్వారా నీటి కొరతను అధిగమించనున్నట్టు ఆయన తెలిపారు.

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఉపాధి హమీ పథకాన్ని  వ్యవసాయానికి అనుసంధానం చేయాల్సిన అవసరాన్ని ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో తాను కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్టు చెప్పారు.దీంతో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు.

రైతాంగం పండించిన పంటకు గిట్టుబాటు ధర విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా ఉందన్నారు. అయితే రైతాంగం కోసం  తమ ప్రభుత్వం బోనస్ చెల్లించిన విషయాలను ఆయన ప్రస్తావించారు. 

ఎరువులు, విత్తనాల కోసం రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొన్నామని ఆయన చెప్పారు.శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి మరో 84వేల ఎకరాలకు అదనంగా నీటిని అందిస్తామని ఆయన హమీ ఇచ్చారు. 
 

click me!