చంద్రబాబు ఇంట్లో విందు, హాజరుకానున్న రాహుల్, మమత

By Nagaraju TFirst Published Nov 10, 2018, 3:17 PM IST
Highlights

బీజేపీయేతర ప్రభుత్వానికి చంద్రబాబు ప్రయత్నాలు మరింత వేగంగా అడుగులు పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను కలిసి ప్రసన్నం చేసుకుంటున్నారు. జాతీయ, ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపీని గద్దె దించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. 
 

అమరావతి: బీజేపీయేతర ప్రభుత్వానికి చంద్రబాబు ప్రయత్నాలు మరింత వేగంగా అడుగులు పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను కలిసి ప్రసన్నం చేసుకుంటున్నారు. జాతీయ, ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపీని గద్దె దించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. 

ఇప్పటికే హస్తిన కేంద్రంగా రెండు సార్లు ఢిల్లీ బాటపట్టిన చంద్రబాబు పలు రాజకీయ పార్టీ నేతలను కలిశారు. మద్దతు కోరారు. అటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఆప్ అధినేత, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సమాజ్ వాద్ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, కర్ణాటక సీఎం కుమార స్వామి, ఆయన తండ్రి దేవెగౌడ, తమిళనాడులో స్టాలిన్ లతోపాటు పలువురు ప్రముఖులను ఇతర పార్టీ నేతలను కలిశారు.   

Latest Videos

అయితే బీజేపీయేతర వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు అవే పార్టీలతో ఏపీలోనే భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా డిసెంబర్ 23న బీజేపీ యేతర పార్టీల అధినేతలకు చంద్రబాబు తన నివాసంలో విందు ఇవ్వనున్నట్లు సమాచారం. 

ఆ విందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ నేత ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, తేజస్వీయాదవ్ లతోపాటు మరో పదిమంది జాతీయ నేతలు హాజరుకానున్నారు.

అదేరోజు అమరావతి వేదికగా జరగనున్న ధర్మపోరాట దీక్షలో రాహుల్ తోపాటు జాతీయస్థాయి నేతలు పాల్గొననున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీల అమలు విషయంలో నరేంద్రమోదీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను రాజధాని వేదిగా తూర్పారబట్టనున్నారు. 

ఇదే వేదికపై బీజేపీయేతర పార్టీలు తమ శంఖారావాన్ని పూరించనున్నాయి. తొలిసారిగా అన్ని పార్టీలు  కలిసి బీజేపీపై తమ విమర్శనల అస్త్రాలను సంధించేందుకు రెడీ అవుతున్నాయి. ధర్మపోరాట దీక్ష సభ వేదికగా తమ ఐక్యతను కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 
 

ఈ వార్తలు కూడా చదవండి

బాబు ఫ్రంట్‌: ధర్మపోరాట దీక్షకు బీజేపీయేతర పార్టీలు

ఎన్టీఆర్ మాదిరిగా మంచోడిని కాను: బాబుపై పవన్ నిప్పులు

చంద్రబాబూ..! జాగ్రత్త: నీ రికార్డులు బయటపెడతాం: హరీష్ సంచలనం

click me!