ఐఆర్ఆర్, అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు: నేడు విచారించనున్న ఏపీ హైకోర్టు

By narsimha lode  |  First Published Oct 11, 2023, 11:32 AM IST

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగళ్లు కేసులో చంద్రబాబు తరపు న్యాయవాదులు  ఏపీ హైకోర్టులో  ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.


అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసులో  ముందస్తు బెయిల్ ఇవ్వాలని  చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ల పై ఏపీ హైకోర్టు బుధవారం నాడు మధ్యాహ్నం విచారణ నిర్వహించనుంది. 

చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను రెండు రోజుల క్రితం  ఏసీబీ కోర్టు  కొట్టివేసింది. దీంతో  నిన్న  ఏపీ హైకోర్టులో  చంద్రబాబు తరపు న్యాయవాదులు  లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే  లంచ్ మోషన్ పిటిషన్ ను విచారించేందుకు ఏపీ హైకోర్టు నిన్న నిరాకరించింది. దీంతో  చంద్రబాబు తరపు న్యాయవాదులు  ఇవాళ  ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.

Latest Videos

undefined

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు కేసులో ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబుపై  కేసు నమోదు చేశారు. మరో వైపు అంగళ్లు కేసులో  కూడ  చంద్రబాబు తరపు న్యాయవాదులు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.ఈ రెండు పిటిషన్లపై ఇవాళ మధ్యాహ్నం ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది.

also read:నేరస్తులకు రక్షణ కవచంగా 17ఏ మారొద్దు: సుప్రీంలో సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ  ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ చేసింది.ఈ కేసులోనే చంద్రబాబు జ్యుడీషీయల్ రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసుతో పాటు  ఏపీ ఫైబర్ నెట్ కేసు,  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగళ్లు కేసులను అధికారులు ముందుకు తీసుకువచ్చారు. ఏపీ ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో  చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో పీటీవారంట్లు సీఐడీ దాఖలు చేసింది.

click me!