కాలేజీ విద్యార్థినిని బ్లాక్ మెయిల్ చేసి లెక్చరర్ అత్యాచారం... గర్భం దాల్చడంతో దారుణంగా కొట్టి..

By SumaBala Bukka  |  First Published Oct 11, 2023, 11:24 AM IST

ఓ ఇంటర్ విద్యార్థిని మీద కన్నేసిన లెక్చరర్ ఆమెను బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గర్భం దాల్చడంతో తీవ్రంగా దాడి చేశాడు. 


మార్కాపురం : ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి దారి తప్పి వ్యవహరించాడు. తన దగ్గరికి చదువు చెప్పించుకోవడానికి వచ్చిన విద్యార్థినిపై కన్ను వేశాడు. కీచకుడిలా మారి ఆ చిన్నారి జీవితాన్ని నాశనం చేశాడు. భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడుగా మారి.. విద్యార్థినిని బెదిరిస్తూ.. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫోన్లో ఆ ఫోటోలను చిత్రీకరించి  వేధింపులకు దిగాడు. టీచర్ అఘాయిత్యంతో బాలిక గర్భం దాల్చింది. ఆమెపై కూడా అతను దాడికి దిగాడు.

మంగళవారం నాడు మార్కాపురంలో ఈ దుర్మార్గమైన ఘటన వెలుగు  చూసింది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు ఇలా తెలిపారు. 2022లో మార్కాపురం పట్టణానికి చెందిన ఓ విద్యార్థిని  స్థానికంగా ఉన్న ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియట్ లో చేరింది.  అక్కడే  లెక్చరర్ గా పని చేస్తున్న గోవింద్ నాయక్ అనే వ్యక్తి బాలికపై కన్నేశాడు. అతను ఎర్రగొండపాలెం మండలం పాలుట్ల గ్రామనివాసి. అతనికి అంతకుముందే పెళ్లయింది. ఓ కొడుకు కూడా ఉన్నాడు. 

Latest Videos

బాబోయ్.. గుండెపోటుతో మరణించిన వ్యక్తి మృతదేహంపై కూర్చుని అఘోరాల పూజలు..

ఓ రోజు కాలేజీ నుంచి ఇంటి దగ్గర దింపుతానంటూ ఆ విద్యార్థినిని తన టు వీలర్ మీద తీసుకెళ్లాడు. అలా ఆమెను నగర శివారుల్లోకి తీసుకెళ్లి అక్కడ ఆమె అసభ్యకర చిత్రాలను ఫోన్లో తీశాడు. ఆ తర్వాత ఆ ఫోటోలను చూపిస్తూ వేధింపులకు పాల్పడడం మొదలుపెట్టాడు. ఆ కాలేజీలో ఎలాగో ఫస్టియర్ పూర్తిచేసిన ఆమె.. ఆ తర్వాత సెకండియర్ కోసం వేరే కాలేజీకి వెళ్లిపోయింది.

కాలేజీ మారినా  గోవింద్ నాయక్ వికృత చేష్టలు మానలేదు. ఆమె ఫోటోలు తన దగ్గర ఉన్నాయంటూ, వాటిని వేరే వాళ్లకు చూపిస్తానంటూ బెదిరించి సాగాడు. ఆ ఫోటోలను చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ ఆ బాలిక మీద పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ విద్యార్థిని గర్భం దాల్చింది. ఈ విషయం తెలియడంతో నిందితుడు ఆమెను అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేశాడు.

ఆ బాలిక దీనికి అంగీకరించకపోవడంతో దాడి చేశాడు. గోవింద నాయక్ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స కోసం ఆసుపత్రిలో చేరింది. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు కడుపుపై దెబ్బలు తగలంతో విద్యార్థిని ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి తలెత్తిందని తెలిపారు. వెంటనే అబార్షన్ చేయించారు. ఆ తరువాత ఈ ఘటన మీద బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ బాలిక ఫిర్యాదు మేరకు ప్రైవేట్ లెక్చరర్ పై అత్యాచారం, పోక్సోతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైద్య పరీక్షలు నిమిత్తం విద్యార్థినిని ఆసుపత్రికి తరలించినట్లుగా  మార్కాపురం ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు.

click me!