జగన్, పవన్ పార్టీలకు ఓటు వేయవద్దు: ఛంద్రబాబు పిలుపు

By sivanagaprasad KodatiFirst Published Aug 25, 2018, 5:48 PM IST
Highlights

 బీజేపీతో లాలూచి పడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీలకు ప్రజలు ఓటెయ్యెద్దని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. కర్నూలు జిల్లాలో ధర్మపోరాట సభలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు వైసీపీ, జనసేన పార్టీలపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాల్సిన ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్ కేసుల కోసం రాజీపడి బీజేపీతో లాలూచీ పడుతున్నారన్నారు.

కర్నూలు: బీజేపీతో లాలూచి పడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీలకు ప్రజలు ఓటెయ్యెద్దని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. కర్నూలు జిల్లాలో ధర్మపోరాట సభలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు వైసీపీ, జనసేన పార్టీలపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాల్సిన ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్ కేసుల కోసం రాజీపడి బీజేపీతో లాలూచీ పడుతున్నారన్నారు.

ప్రతీ శుక్రవారం హైకోర్టుకు హాజరయ్యే జగన్ తనను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి తమ సత్తా చాటారన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే బీజేపీ భయపడేలా చేశారన్నారు. మరోవైపు మెున్నటి వరకు తనను మంచోడన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తననే విమర్శిస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి నిధులివ్వని కేంద్రాన్ని పవన్ నిలదియ్యడం లేదని అది లాలూచీ కాదా అని ప్రశ్నించారు.  

బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. తెలుగుదేశం పార్టీని బలహీన పరిచేందుకు బీజేపీ ఎన్నో కుట్రలు పన్నుతుందన్నారు. ఓ ఎంపీతో పార్టీ పెట్టిందన్నారు. బీజేపీ మరిన్ని పార్టీలు పెట్టించినా టీడీపీకి ఎలాంటి నష్టం వాటిల్లదన్నారు. 

రాబోయే ఎన్నికల్లో 25 ఎంపీలను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చంద్రబాబు తెలిపారు. భావితరాల భవిష్యత్ కోసం, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన పార్టీకి గుణపాఠం చెప్పేందుకు 25మంది ఎంపీలను గెలిపించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే ఎవరు ప్రధాని కావాలో నిర్ణయించేది మనమేనని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పుడు ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీలు అమలువుతాయని తెలిపారు. 

త్వరలో ఎంపీలతో సమావేశమై కేంద్రప్రభుత్వంపై భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఎలాంటి వ్యూహాలు అమలు చెయ్యాలి...ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలో ఆలోచిస్తామన్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ ఉచ్చులో పడలేదు, సత్తా చాటుతాం: చంద్రబాబు

మరోసారి కేంద్రంపై ధ్వజమెత్తిన చంద్రబాబు

click me!