హిందూపురంలో బాలకృష్ణ ఓడిపోతారా..?

Published : Aug 25, 2018, 04:24 PM ISTUpdated : Sep 09, 2018, 01:10 PM IST
హిందూపురంలో బాలకృష్ణ ఓడిపోతారా..?

సారాంశం

టీడీపీ నేతలు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని  అనంతపురం జిల్లాలో సర్వే చేయిస్తున్నారు. దీనిలో భాగంగానే హిందూపురంలోనూ సర్వే చేపట్టారు. 

అనంతపురం జిల్లా హిందూపురం లో గతేడాది బాలకృష్ణ అఖండ విజయం సాధించారు.  తొలిసారిగా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆయన కచ్చితంగా గెలవరని కొందరు వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ మ్యాటరేంటంటే.. టీడీపీ నేతలు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని  అనంతపురం జిల్లాలో సర్వే చేయిస్తున్నారు. దీనిలో భాగంగానే హిందూపురంలోనూ సర్వే చేపట్టారు. అయితే.. సర్వే వారికి అనుకూలంగా వచ్చేందుకు వైసీపీ నేతలను సైతం టీడీపీ నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. 

కావాలనే టీడీపీకి మద్దతుగా సర్వే చేస్తున్నారని ఆరిపిస్తూ 15మంది యువకులను వైసీపీ నేతలు పోలీసులకు అప్పగించారు. హిందూపురంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, వైసీపీ నేతలను ప్రలోభపెడుతున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ నేత నవీన్‌ నిశ్చల్‌ ఆరోపించారు. సర్వే పేరుతో వైసీపీ నేతల కీలక సమాచారాన్ని సేకరించడం దుర్మార్గమన్నారు. వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ ఓడిపోవడం ఖాయమన్నారు. అందుకే టీడీపీ నేతలు భయపడి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

PREV
click me!

Recommended Stories

సరుకు, సామాన్లు పదాలు బూతులుగా ఎందుకు మారాయి? | Telugu Explainer | Asianet News Telugu
IMD Rain Alert : ఈ సంక్రాంతికి వర్ష గండం.. ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలం తప్పేలా లేదు