చంద్రబాబు అరెస్ట్ : జగన్ ను అడ్డుపెట్టుకుని కేంద్రం నాటకం ఆడుతోంది.. మాజీ ఎంపీ కేవీపీ

Published : Oct 31, 2023, 01:29 PM IST
చంద్రబాబు అరెస్ట్ : జగన్ ను అడ్డుపెట్టుకుని కేంద్రం నాటకం ఆడుతోంది.. మాజీ ఎంపీ కేవీపీ

సారాంశం

జగన్ వెనకుండి కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు అరెస్టు లో నాటకం ఆడుతోందని మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు మండిపడ్డారు. 

అమరావతి : రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచందర్రావు చంద్రబాబు అరెస్ట్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.  చంద్రబాబు అరెస్టు వెనక కేంద్రం హస్తం ఉందన్నారు. జగన్ ని అడ్డం పెట్టుకొని కేంద్రం నాటకం ఆడుతుందని ఆయన మండిపడ్డారు. ఈ విషయాన్ని రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెబుతారని చెప్పుకొచ్చారు. లోకేష్ కి కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వడమే ఇందుకు నిదర్శనమని ఆయన ఘాటుగా విమర్శించారు.

సోమవారం ఏపీ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గ తొలి సమావేశం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో  జరిగింది. దీనికి రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ రూపొందించిన రైతు తీర్మానాల తెలుగు అనువాద పుస్తకాన్ని ఎన్ రఘువీరారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గానే కేవీపీ జగన్ మీద, కేంద్ర ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. 

చంద్రబాబుకు బెయిల్ షూరిటీలు ఇవ్వనున్న బోండా ఉమ, దేవినేని ఉమ...

‘మద్యనిషేధం అమలు చేస్తామని చెప్పిన ఏపీ సీఎం జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం వ్యాపారాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారన్నారు. అంతేకాదు మద్యం అమ్మకాల మీద సరైన లెక్కలు లేవని అన్నారు. మద్యం విక్రయాల్లో పారదర్శకత లేదని.. కేవలం నగదు మాత్రమే తీసుకుంటున్నారని విమర్శించారు. ఈ విషయంలో ఎన్ని ఆరోపణలు వచ్చినా కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ప్రశ్నించారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్