చంద్రబాబు మధ్యంతర బెయిల్ షురిటీ పై టీడీపీ నేతలు బోండా ఉమా, దేవినేనిలు సంతకాలు పెట్టారు. ఈ సాయంత్రం లోగా చంద్రబాబు బైటికి రానున్నారు.
రాజమండ్రి : చంద్రబాబు మధ్యంతర బెయిల్ కు టీడీపీ నేతలు షూరిటీలు ఇచ్చారు. మధ్యంతర బెయిల్ కోసం విధించిన షరతుల్లో..లక్ష రూపాయల పూచీకత్తు.. ఇద్దరు షురిటీలు ఇవ్వాలని షరతు ఒకటి. ఈ మేరకు టీడీపీ నేతలైన బోండా ఉమ, దేవినేని ఉమలు లక్ష రూపాయల పూచీకత్తులు ఇవ్వనున్నారు. చంద్రబాబు బెయిల్ నేపథ్యంతో విజయవాడ నుంచి చంద్రబాబు కాన్వాయ్ రాజమండ్రికి బయలుదేరింది.
చంద్రబాబునాయుడు బెయిల్ కు సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యి బైటికి రావడానికి సాయంత్రం అయ్యే అవకాశాలున్నాయి. బెయిల్ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో రాజమండ్రి జైలు దగ్గరికి నేతలు, కార్యకర్తలు రానున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుకోనున్నారు. జిల్లా పోలీసులతో పాటు, ఎన్ఎస్ జీ కూడా జైలు దగ్గర మోహరించనుంది. ఇక బెయిలుపై విడుదలైన చంద్రబాబును రాజమండ్రినుంచి నేరుగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించనున్నారు.
చంద్రబాబుకు బెయిల్... టపాసులు కాలుస్తూ, మిఠాయిలు పంచుకుని టిడిపి సంబరాలు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఊరట లభించింది. గత 53 రోజులుగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు మధ్యంతర భైలును మంజూరు చేసింది. అయితే అంతకుముందే చంద్రబాబు నాయుడుతో మంగళవారం మూలకాతయేందుకు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చం నాయుడు, టిడిపి నేతలు ఏలూరి సాంబశివరావు, సత్య ప్రసాద్ లు అమరావతి నుంచి బయలుదేరి రాజమండ్రి కి వెళుతున్నారు.
మధ్యంతర బెయిల్ విషయం తెలియడంతో ఆయనకు స్వాగతం పలికేందుకు ప్రతి జిల్లా నుంచి టీడీపీ నేతలు రాజమహేంద్రవరానికి బయలుదేరారు. చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఈరోజు సాయంత్రం బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయనను భారీ ర్యాలీతో రాజమండ్రి నుంచి అమరావతికి తీసుకురానున్నారు. అయితే రాజమండ్రి నుంచి నేరుగా విజయవాడకు చంద్రబాబు వెళ్తారని టిడిపి అదిష్టానం తెలిపింది. అయితే, చంద్రబాబును ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు వెళ్లనున్నట్టు సమాచారం. చంద్రబాబు బెయిల్ నేపథ్యంలో ఎన్ ఎస్జీ, పోలీసులు జైలు దగ్గరికి చేరుకుంటారు.