యుద్ధం మొదలైందని లోకేష్ పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజమండ్రి:యుద్ధం మొదలైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు. ఏపీ స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని పార్టీ నేతలు లోకేష్ దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో యుద్ధం ఇప్పుడు మొదలైందని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ ఏడాది నవంబర్ 8న లేదా 9న తీర్పును వెల్లడించనుంది.ఈ తీర్పు కూడ చంద్రబాబుకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని లోకేష్ పార్టీ నేతలతో అభిప్రాయపడినట్టుగా సమాచారం.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు ఈ ఏడాది సెప్టెంబర్ 9న అరెస్ట్ చేశారు.ఈ కేసులో అరెస్టైన చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇవాళ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
undefined
ఇవాళ చంద్రబాబుతో ములాఖత్ అయ్యేందుకు లోకేష్, బ్రహ్మణి రాజమండ్రికి చేరుకున్నారు. అయితే రాజమండ్రికి లోకేష్, బ్రహ్మణి వెళ్లే సమయంలో బాబుకు బెయిల్ మంజూరైంది. రాజమండ్రికి చేరుకున్న లోకేష్ కు బాబుకు బెయిల్ వచ్చిన విషయాన్ని చెప్పారు.
also read:బాబుకు మధ్యంతర బెయిల్: టీడీపీ ఆఫీస్ వద్ద శ్రేణుల సంబరాలు
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ కావడంతో ఈ విషయమై పలు పార్టీల జాతీయ నేతలకు లోకేష్ వివరించారు. ఢిల్లీలో పలు పార్టీలతో లోకేష్ సమావేశమయ్యారు. అంతేకాదు చంద్రబాబు కేసుల విషయమై ఢిల్లీ వేదికగా న్యాయనిపుణులతో చర్చించారు. చాలా రోజుల పాటు లోకేష్ ఢిల్లీలోనే గడిపారు. లోకేష్ ఢిల్లీలో ఉన్న సమయంలో వైసీపీ నేతలు ఆయనపై సెటైర్లు వేశారు. అరెస్ట్ చేస్తారనే భయంతో లోకేష్ ఢిల్లీకి వెళ్లారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టుల్లో వాదనలు విన్పించేందుకు గాను ప్రముఖ లాయర్లతో లోకేష్ చర్చించారు. విదేశాల్లో ఉన్న హరీష్ సాల్వే కూడ ఈ కేసులో వర్చువల్ గా వాదనలు విన్పించిన విషయం తెలిసిందే.